రైతుల చేలు ఎండి, ప్రజలకు గొంతు ఎండుతుంటే..మీకు క్రికెట్ ముఖ్యమా రేవంత్ రెడ్డీ

– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆరుగాలం కష్టించి రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతుంటే నీవు మాత్రం క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తావా…!  అంటూ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి పై ద్వజమెత్తారు. మండుటెండలో మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఎండిన పంటలను సందర్శిస్తూ రైతులకు మనో ధైర్యం కల్పిస్తున్నారని,ఆయన ప్రజా నాయకుడని ఉదాహరించారు. రైతు సమస్యలపై స్థాని కార్యాలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ అదిష్టానం పిలుపుకు శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా లో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ‘మెచ్చా’ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలనను విస్మరిస్తుంది అని ఆరోపించారు.ఎండిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని,వరికి రూ.500 బోనస్ చెల్లించి, సాగర్ జలాలతో ప్రజలు ఎదుర్కోంటున్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి 2014 కు ముందు పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందిరమ్మ రాజ్యంలో కరువు తాండవిస్తుంది అని,నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ రుజువు అవుతుందని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణలో బ్రతుకులకు భరోసా ఉంటుందని, జనం ఇప్పుడు గ్రహిస్తున్నారు అని అన్నారు.మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు ఏదో చేస్తారన్న ఆశతో మిమ్మల్ని ఎంజాయ్ చేయమని కాదు, ప్రతిపక్ష పార్టీల దుర్భాషలాడటానికి కాదని హితవు వలికారు.చేతనైతే ప్రజలకు మంచి చేయి, అంతేకానీ బీఆర్ఎస్ ను అణగదొక్కాలని చూస్తే.. ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చిందని, అందుకే గత పదేళ్ళుగా రైతులు రాజు ల్లా బ్రతికారు అని, ప్రజా పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల పాలనకే ప్రజల నుండి చీత్కరింపులు ఎదుట్కోంటుందని మండిపడ్డారు. రైతు సమస్యలను పరిష్కరించకుంటే మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం మొదలవుతుందని స్పష్టం చేశారు.వరికి బోనస్, పంట నష్టపరిహారం, నీటి సమస్య పరిష్కారంతో రైతు రుణమాఫీ చేయకుంటే కరువులో కొట్టుకుపోతారని జోస్యం చెప్పారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ పి.కృష్ణ ప్రసాద్ కు అందజేశారు. ఇందుకు స్పందించిన తహశీల్దార్ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని హమీ ఇచ్చారు.కార్యక్రమంలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, వైఎస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాశరావు చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్, నాయకులు జెకీవీ రమణారావు,మందపాటి రాజ మోహన్ రెడ్డి, సత్యవరుపు సంపూర్ణ, వెంకన్న బాబు, నారం రాజశేఖర్,దారా యుగంధర్, యార్లగడ్డ బాబు అబ్దుల్ జిన్నా, చిప్పనపల్లి బజారియ్య, చరణ్, బుచ్చిబాబు, నక్కా రాంబాబు, జుజ్జూరపు శ్రీరామ్మూర్తి, లక్ష్మయ్య, తాళం సూరి లు పాల్గొన్నారు.
Spread the love