తిరుగుబాటు చేస్తున్న పేటీఎం ఉద్యోగులు..

నవతెలంగాణ – హైదరాబాద్ : పేటీఎం‌లో లేఆఫ్స్ పరంపరపై ఆ సంస్థ ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా చేయాలని ఆ సంస్థ కోరుతున్నా వారు అందుకు వారు నిరాకరిస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ లెటర్, బోనస్, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఆ సంస్థ విఫలమైంది. తీసుకున్న బోనస్ కూడా తిరిగిచ్చేయాలని సంస్థ ఒత్తిడి చేస్తుండటంతో వారు ఈ సమస్యను కార్మికశాఖ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Spread the love