మోడీతో సత్యనాదెళ్ల భేటీ…

  • నవతెలంగాణ -న్యూఢిల్లీ
    మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. డిజిటలైజేషన్ ద్వారా జరుగుతున్న సుస్థిర, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి గురించి చర్చించారు. ఈ వివరాలను సత్య నాదెళ్ల ట్విటర్ వేదికగా తెలిపారు. లోతైన అవగాహన కలిగేవిధంగా జరిగిన సమావేశం పట్ల సత్య నాదెళ్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిర, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించడం స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ సాకారమయ్యేందుకు సహకరించడానికి, ప్రపంచానికి దివిటీగా నిలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Spread the love