నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని భావిస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్బంగా మధ్యప్రదేశ్ బినాలో గురువారం ప్రధాని ర్యాలీ నిర్వహంచారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు. ” ఇటీవల వారు ముంబయిలో సమావేశం నిర్వహించారు. అక్కడ అహంకార కూటమిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే రాజకీయ వ్యూహాన్ని నిర్ణయంచుకున్నారు. రహస్యంగా అజెండాను కూడా ఖరారు చేసుకున్నారు. భారతీయ సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం” అని అన్నారు. భారతీయుల విశ్వాసాలపై దాడి చేయాలని, వేల ఏళ్లుగా దేశాన్ని ఐక్యంగా నిలిపిన విశ్వాసాలు, విలువలు, సాంప్రదాయాలను అంతంచేయాలని నిర్ణయించుకున్నారని ఆరోపించారు.