కాంగ్రెస్ తోనే లింగాయతులకు సరైన న్యాయం 

– ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై కొడిచెర గ్రామంలో పాలాభిషేకం 

నవతెలంగాణ – మద్నూర్ 
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లింగాయత్ సమాజ్ కు సరైన న్యాయం చేకూరుతుందని, గతంలో లింగాయత్ సమాజాన్ని బీసీలకు మార్చడం ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లింగాయత్ సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామ తాజా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్ పేర్కొన్నారు. లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  సురేష్ షట్కార్ చిత్రపటాలకు పొడిచెర గ్రామ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కోడిచర గ్రామ లింగాయత్ అధ్యక్షులు బుక్కవర్ మారుతి,ఉపఅధ్యక్షులు పొట్టేవార్ గంగాధర్ . గ్రామ మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్  బోలేవార్ ఉమాకాంత్, శివకుమార్.జుబ్రే బస్వంత్, హనుమంత్. సుభాష్, సురేష్ లింగాయత్  గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.
Spread the love