– రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమ సింగ్
నవతెలంగాణ-చేవెళ్ల
నేటి నుంచి నామిషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. గురువారం చేవెళ్లలోని డిస్ట్రీబ్యుషన్ కేంద్రాన్ని, చేవెళ్ల ఆర్డీవో కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. చేవెళ్ల అర్డీవో సాయిరాంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫారా ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన్నట్టు వెల్లడించారు. చేవెళ్ల నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో భారీ కేడ్లు ఏర్పాటు చేశామన్నారు. 417 వీవీ ప్యాట్లు, 372 సీయూలు, 372 బీయూలు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రం సమీపంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రం, రిసెప్షన్ సెంటర్ ఆర్మీ మైసమ్మ దేవాలయం సమీపంలో ఉన్న లార్డ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 23 సెక్టర్లు ఉన్నాయన్నారు. 1066 మంది ఆఫీసర్లకు శిక్షణ పూర్తి చేశామన్నారు. ర్యాలీ, సభల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 48 గంటల ముందు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.