నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2026 చివరి దశకు వచ్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగిన హార్దిక్ పాండ్యా, జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్తున్నాడని ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో లక్నో కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ కూడా అందరికీ షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి సమాచారం ఇవ్వగా, ఓనర్ సంజీవ్ కూడా అంగీకారం తెలిపారట. కెప్టెన్ గా తప్పుకున్న రిషబ్ పంత్… లక్నో జట్టులో ప్లేయర్ గా కొనసాగుతాడా ? లేక జట్టు నుంచి బయటకు వెళ్తాడా ? అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఐపీఎల్ 2026 లో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్… కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్ లో లక్నో చిట్ట చివరన నిలిచింది. ఇంత ఘోరమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో బాధ్యత వహిస్తూ, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు రిషబ్ పంత్.
రిషబ్ పంత్ షాకింగ్ నిర్ణయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



