నవతెలంగాణ – తిమ్మాజిపేట : ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లే రహదారిలో నిలిచిన మరుగు నిరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ ఏర్పాటు చేయాలని బి ఎస్ పి నాగర్ కర్నూల్ అసెంబ్లీ అధ్యక్షులు ఎర్రోళ్ల పరుశురాం అన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రహదారిలో వర్షపు నీరు ఆగి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సరైన డ్రైనేజీ ఏర్పాటు చేసి నీరు ఉండకుండా చూడాలని ఎంపీడీవో లక్ష్మీదేవికి బీఎస్పీ నాయకులు ఎర్రోళ్ల పరుశురాం మండల అధ్యక్షులు నాగపు శంకర్ తో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, తాసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ కార్యాలయాలకు నిత్యం పనుల మీద వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం పూర్తిగా గుంతలతో వర్షపు నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు రైతులు కార్యాలయానికి వెళ్లేందుకు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య కారణంగా ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు గుంతలను పూడ్చడం, సీసీ రోడ్, మెటల్ రోడ్ నిర్మాణం చేయడం, మురుగు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజ్ ఏర్పాటు చేయాలన్నారు. తాత్కాలికంగా గ్రావెల్ లేదా మట్టి వేయించి ఈ సమస్య ను పరిష్కరించాలని అన్నారు.
మరుగు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



