నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రి పరిధిలో గల పాత బిల్డింగ్ పురాతనమైనదిగా ప్రమాదకరంగా మారిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డిసిహెచ్ఓ విజయ్ భాస్కర్, మద్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా భాగంగా ఆస్పత్రి వార్డులన్నీ పరిశీలించారు. వైద్యుల సూచన మేరకు పాత బిల్డింగు పురాతనమైందని, ఈ బిల్డింగ్ ప్రమాదకరంగా మారిందని, ఈ బిల్డింగు పరిధిలో మూడు వైద్య శాఖలు ఆయుర్వేదిక్, ఐ సి టి సి, లింకు ఏఆర్టి, ఈ విధంగా మూడు శాఖలు కొనసాగుతున్నాయని, ఈ బిల్డింగుతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్లు సూచించారు. ఎమ్మెల్యే బిల్డింగును పూర్తిగా పరిశీలించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆసుపత్రి కావాల్సిన అవసరాలు ఏమిటి అనే వాటి గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
పాత బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



