Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి ఉపాధ్యాయుల సంఘీభావం 

ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి ఉపాధ్యాయుల సంఘీభావం 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్  రూపారెడ్డి విద్యార్థుల చేతిలో హత్యకు గురైన నేపథ్యంలో బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కొవ్వొత్తులను ప్రదర్శించి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇలాంటి సంఘటనలు పునారవృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ బృందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ కార్తన్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -