Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడుంబా తయారీదారుల బైండోవర్

గుడుంబా తయారీదారుల బైండోవర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం అడ్వాలపల్లి గ్రామానికి చెందిన నలుగురు గుడుంబా తయారీదారులను గుర్తించి శుక్రవారం మండల తాసిల్దార్ రవికుమార్ ముందు రూ.లక్ష పూచీకతతో బైండ్ ఓవర్ చేయడం జరిగిందని కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బైండోవర్ చేసినవారు గుడుంబా తయారీ చేసినట్లయితే వీరిపై కేసు నమోదుతో పాటు రూ.లక్ష రూపాయల జరిమానా, చట్టపరంగా విధించబడుతుందన్నారు. అలాగే మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని గుడుంబా తయారీదారులందరినీ గుర్తించి మండల తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -