Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ 

మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని జగదాంబ తండా గ్రామపంచాయతీ పరిధిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ లతా బాయ్ నంద నాయక్ భూమి పూజ నిర్వహించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతంలో భాగంగా, మహిళలంతా ఒకచోట సమావేశమై చర్చించుకోవడానికి ఒక వేదిక కోసం సంఘ భవనాన్ని మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూర్ణ రాజు నాయక్, పంచాయతీ కార్యదర్శి గడ్డం అరవింద్ రెడ్డి, నాయకులు చందర్ నాయక్, రాజు నాయక్, తాండ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -