ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశంలో ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) అమాంతం పెరిగడంతో సామాన్యుల జేబులకు చెల్లు పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిత్యావసర వస్తువులతో పాటు ఆభరణాల ధరలు అమాంతం పెరగడంతో సిపిఐ 3.48 శాతానికి పెరిగింది. మంగళవారం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇంత్రకితం మార్చిలో 3.40 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతూ వస్తోంది. జనవరిలో 2.74 శాతం, ఫిబ్రవరిలో 3.21 శాతంగా నమోదయ్యాయి. ఇప్పుడు మరింత పెరిగి ఏడాది గరిష్ట సామాన్యుడి జేబుకు చిల్లు స్థాయికి చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా 1,407 పట్టణ మార్కెట్లు ,1,465 గ్రామాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్‌ఎస్‌ఒ ఈ గణాంకాలను వెల్లడించింది.
వంటగదికి సెగ..
ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సూచీ 3.87 శాతం నుండి 4.20 శాతానికి చేరింది. వెండి ఆభరణాల ధరల్లోనూ144.34 శాతం పెరుగుదల నమోదు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాల ధరలు కూడా 40.72 శాతం పెరిగాయి. కూరగాయల విషయానికి వస్తే టమోటా ధర 35.28 శాతం, కాలీఫ్లవర్ 25.58 శాతం చొప్పున ధరలు ఎగిశాయి. కొబ్బరి ధరలు 44.55 శాతం పెరిగాయి. అయితే.. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కార్లు, ఎసి ధరలు కొంత మేర తగ్గాయి.
తెలంగాణలోనే ఎక్కువ..
దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ప్రభావం వేర్వేరుగా ఉంది. తెలంగాణలో అత్యధికంగా 5.81 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, మిజోరంలో అత్యల్పంగా 0.69 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.74 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 3.16 శాతంగా నమోదయ్యింది.
వడ్డీ రేట్లు పెరగొచ్చు..
రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అంచనా వేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలపై పడే ప్రతికూల ప్రభావం ధరలు మరింత పెరగడానికి కారణం కావచ్చని ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా దేశంలో పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచవచ్చని నిపుణులు, ఆర్థిక ఎజెన్సీలు అంచనా వేస్తోన్నాయి.
ఎగిసిన నిత్యావసరాల ధరలు
- Advertisement -
- Advertisement -


