ఆర్ఎంపీ, పీఎంపీ పారామెడికల్ శిక్షణ తరగతులు పున ప్రారంభించాలా చూడాలి..

– తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపెట్టెస్టో చైర్మన్ శ్రీదర్ బాబుకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – భూపలాపల్లి
పదేళ్ల క్రితం నిలిసిపోయిన ఆర్ఎంపీ, పిఎంపి పారా మెడికల్ శిక్షణ తరగతులను పున:ప్రారంబించేలా చూడాలని,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో లో చేర్చాలని మంగళవారం తెలంగాణ ఆర్ఎంపీ,పిఎంపి వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, మండల నాయకులు బండి సుధాకర్,వొన్న తిరుపతి రావు ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ఎంపీ, పిఎంపిల సేవలను ప్రథమంగా మాజీ ముఖ్యమంత్రి,,స్వర్గీయ, దివంగత నేత వైఎస్ఆర్ గుర్తించి పారా మెడికల్ శిక్షణ తరగతులు ప్రారంభించినట్లుగా తెలిపారు. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించిన తరువాత శిక్షణ తరగతులు నిలిచిపోయాయన్నారు.2014 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ కు పారా మెడికల్ శిక్షణ తరగతులు పున;ప్రారంభించాలని, శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందజేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ మేనిపిస్టో పారా మెడికల్ శిక్షణ కార్యక్రమాన్ని చేర్చి ఆర్ఎంపీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు శ్రీదర్ బాబు సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు.

Spread the love