పాలకులు, అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: కొత్తపల్లి శివకుమార్

– సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఇకనుండి పాలకులు అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని మంగళవారం  విక్రంభం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలల నుండి ఎన్నికల హడావుడిలో ఉండి అధికారులు పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందుల పాలయ్యారు ముఖ్యంగా సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒకపక్క అధిక ఎండలతోటి ప్రజల సమస్యలతో ఉంటే దీనికి తోడు నీటి ఇబ్బందులు కరెంటు సమస్యలు అదేవిధంగా మునిసిపాలిటీ వారు నిద్రావస్థలో ఉండటంవల్ల పట్టణంలో డ్రైనేజీలో చెత్త కూరకపోయి దుర్వాసన రావడం ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం చేయడం వల్ల పట్నంలో అనేకచోట్ల నీరు పోయాక పోవడం వల్ల మొక్కలు ఎండిపోయాయి, విలీన గ్రామాల్లో రోడ్లు గుంటలు పడి సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ చెత్తతో నిండటం వల్ల విలీన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అదేవిధంగా ఐకెపి సెంటర్లలో పంటలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల అకాల వర్షాలకు తడిచి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇకనైనా పాలకులు అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజలు  ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు  లింగన్న పార్టీ నాయకులు శేషగిరి, బిక్షం ,మీరా తదితరులు పాల్గొన్నారు.
Spread the love