– కుప్పగండ్ల పాలసీతళీకరణ కేంద్రం అధ్యక్షులు శ్రీను నాయక్..
నవ తెలంగాణ- వెల్డండ: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతి యువకులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరాలని కుప్పగండ్ల పాలసీతళీకరణ కేంద్రం అధ్యక్షులు శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కేస్లి తండ లో నిర్వహించిన తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. పోటీలలో గెలుపొందిన మొదటి విజేత ఎల్లమ్మ రగాపుర్ తండా టీం కు రూ . 20 వేల నగదు బహుమతినీ, షీల్డ్ ను అందజేశారు. అలాగే ద్వితీయ విజేత కేస్లి తండా టీంకు రూ. 10 వేల నగదు బహుమతి, షీల్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బుజ్జి లక్ష్మణ్ నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, నిర్వాహకులు క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.