గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్‌.. ప్రారంభించిన సచిన్

 

నవతెలంగాణ హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్‌ ఆఫ్‌ మారథాన్‌’ నిర్వహించారు. ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన జెండా ఊపి 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్‌ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. యువత  పెద్ద ఎత్తున మారథాన్‌ రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Spread the love