Sunday, May 24, 2026
E-PAPER
Homeఆటలువెల్‌డ‌న్ అర్జున్‌..కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్

వెల్‌డ‌న్ అర్జున్‌..కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తరఫున అర్జున్ నిన్న తన తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికీ, అర్జున్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ తన కుమారుడిని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఈ సీజన్‌లో అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు రాకపోయినా, ఓపికగా, సానుకూలంగా ఉన్న తీరుప‌ట్ల‌ తనకు గర్వకారణంగా ఉందని సచిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. “అర్జున్.. చాలా బాగా ఆడావు. ఈ సీజన్ మొత్తం నీ సామర్థ్యాన్ని నమ్ముతూ, ఓపికతో ఉంటూ, నిశ్శబ్దంగా కష్టపడిన తీరు చూసి గర్వపడుతున్నాను. చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం ఎదురుచూసినా నువ్వు సానుకూలంగా ఉన్నావు. క్రికెట్ అనేది నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది. ఈ రోజు నువ్వు ఆ రెండింటినీ అద్భుతంగా ప్రదర్శించావు. ఎప్పుడూ ఇలాగే ఉండు. ఆటను ప్రేమించడం కొనసాగించు. లవ్ యూ ఆల్వేస్” అంటూ సచిన్ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -