సాయి చంద్‌ మరణం బీఆర్‌ఎస్‌కు తీరనిలోటు

– ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి
ప్రముఖ గాయకుడు ఉద్యమ కారుడు తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఆధ్యం పోసిన వ్యక్తి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయి చంద్‌ మరణ వార్త తనని దిగ్భ్రాంతి కి గురిచేసిందన్నారు. గురువారం భువనగిరి పట్టణంలో సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్‌ తన పాటలతో ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. తెలంగాణ గడ్డ ఒక మంచి గాయకుణ్ణి కోల్పోయిందని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మెన్‌ చింతల కిష్టయ్య నాయకులు పాల్గొన్నారు. చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మండలంలోని ఎస్‌.లింగోటం గ్రామంలో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్‌, గాయకుడు సాయిచంద్‌ చిత్రపటానికి సింగిల్‌విండో ఛైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, చెన్నగోని అంజయ్యగౌడ్‌, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, బొడిగె ఆనంద్‌గౌడ్‌, ఆకుల శ్రీకాంత్‌, కొత్త పర్వతాలు, పిట్టల శంకరయ్య, తొర్పునూరి మల్లేశ్‌గౌడ్‌, పల్చం రమేశ్‌, ప్రకాశ్‌రెడ్డి, బాతరాజు యాదయ్య, చెన్నగోని రామస్వామి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.ఆలేరురూరల్‌ : ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌్‌, ప్రముఖ గాయకుడు సాయి చందు చిత్రపటానికి గురువారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సాయి చందు సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ ,మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌్‌ గ్యాదపాక నాగరాజు, విద్యా కమిటీ చైర్మెన్‌ రాజబోయిన కొండల్‌ ,గ్రామ శాఖ అధ్యక్షుడు జంగస్వామి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మామిడాల భానుచందర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ మామిడాల నరసింహులు, పీిఏసీఎస్‌ డైరెక్టర్‌ మల్లేశ్‌, నాయకులు దూసరి గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ సాయి చందు మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని వైఎస్సార్‌టీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి గ్యార నరేష్‌ అన్నారు. గురువారం మండలంలోని మంతాపురి గ్రామంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలిలో పాటలు పాడుతూ సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి సాయి చందు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బిడ్డలను కోల్పోయిన ఎంతోమంది తల్లుల దుఃఖశోకం నుండి బయటకు రావాలని పాటలు పాడి వారిని పాటల ద్వారానే ధైర్యం నింపిన వ్యక్తి సాయి చందు అని కొనియాడారు. ఆలేరుటౌన్‌ : తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తన పాటతో భాగస్వామ్యమైన గాయకుడు, గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మెన్‌ సాయి చందు మతి పట్ల గురువారం పలువురు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, మాజీ శాసనసభ్యులు , జెడ్పి ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కే. నగేష్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదగాని హరి శంకర్‌ గౌడ్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ సాయిచంద్‌ గుండెపోటుతో మతి చెందడంతో పట్టణంలో గురువారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌.జిల్లా గ్రంధాల డైరెక్టర్‌ ఆడెపు బాలస్వామి.ఆర్టిఏ మెంబెర్‌ పంతం కష్ణ.అంజన్‌ కుమార్‌ ముదిగొండ శ్రీకాంత్‌. మన్నె సంతోష్‌. ఆలేరు యూత్‌ అధ్యక్షుడు పూల శ్రావణ్‌ బింగి గణేష్‌, బెదరకోట దుర్గేష్‌ ,మాడిశెట్టి హేమేంధర్‌, సీసా. ప్రవీణ్‌, మహమ్మద్‌, పయాజ్‌ ,టింకు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట : తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలుగించిన ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ మౌర్య సాయిచందు ఆకస్మికంగా మతి చెందడంతో గురువారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్‌ఎస్‌ మండల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీిఎంఎస్‌ మాజీ జెల్లా డైరెక్టర్‌ జిల్లా వెంకటేష్‌, నాయకులు గోదాసు పథ్వీరాజ్‌, కోట సుధాకర్‌, కొమ్ము శేఖర్‌, వైద్యం సాయి, కేశవదాసు ఉదరు, మండ్ర నరేష్‌, బుర్రి రవి, గోదాసు శ్రీనివాస్‌, ఊట్కూరి శ్రీను, జవ్వాజి శ్రీకాంత్‌, కళ్యాణ్‌, జానీ ఉన్నారు.

Spread the love