థియేటర్‌లో టపాసులు పేల్చిన సల్మాన్‌ అభిమానులు

న‌వ‌తెలంగాణ‌-మహారాష్ట్ర: ‘టైగర్‌ 3’. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12 న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల అయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు సినీ లవర్స్‌ మహారాష్ట్రలోని మాలెగావ్‌లోని మోహన్ సినిమా థియేటర్‌లో వీరంగం సృష్టించారు. సల్మాన్‌ ఎంట్రీ సమయంలో థియేటర్‌లో స్క్రీన్‌ ముందు టపాసులు పేల్చారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంకొందరు థియేటర్‌లో డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

Spread the love