– ప్రమాదాలకు అడ్డగా మారిన లింకు రోడ్లు
– ద్విచక్ర వాహనదారులకు ప్రాణగండమే
– రాత్రి పూట వెళ్ళాలంటే నరకమే
– లింకు రోడ్లపై బీటీ రోడ్డు వేయాలి
నవతెలంగాణ-మంచాల
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో నోముల నుండి ఆగపల్లి, ఆరుట్ల నుండి ఎల్లమ్మ తండా, మంచాల నుండి తాళ్ళపల్లి గూడ,జపాల్ నుండి గున్‌గల్ గల లింకు రోడ్లు ప్రమాదాలు అడ్డగా మారాయి. ఈ రోడ్లన్నీ కంకర రోడ్లు కావడంతో వర్షాలు వచ్చినప్పుడు రోడ్డు పైన మట్టి అంత కొట్టుక పోయి, కంకర అంత తేలిరోడ్లన్నీ గుంతలమయంగా మారడం వల్ల పలు మార్లు రోడ్డు ప్రమాదాలు జరిగి కొంతమంది వ్యక్తులు చనిపోయారు. లింకు రోడ్లపై ద్విచక్ర వాహనాల దారులు ప్రయాణం చేయాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. లింకు రోడ్లపై వెళితే ప్రాణభయం, ఇతర రోడ్ల పై వెళ్ళాలంటే దూరం పెరుగుతుంది. సమయం వృథా అవుతుంది. పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉదాహరణకు నోముల నుండి ఆగపల్లికి లింకు రోడ్డుపై వెళ్ళితే 4 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. నోముల నుండి లింకు రోడ్డుపై వెళ్లకుండా నోముల నుండి ఇబ్రహీం మీదుగా ఆగపల్లికి వెళ్ళితే 13 కిలోమీటర్లు అవుతుంది. ప్రతి లింకు రోడ్డు పరిస్థితి అలాగే ఉంది. ఈ లింకు రోడ్లు ఇప్పటివి కావు. 50 ఏండ్ల నుండి ఉన్న లింకు రోడ్లే ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన లింకు రోడ్లు పరిస్థితి మాత్రం మారడం లేదు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి లింకు రోడ్లపై బీటీ రోడ్డు వేయాలి.