ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక విక్రయాలు

– ఇసుక రీచ్ ను ప్రారంభించిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మన ఇసుక వాహనం అనే ఆన్లైన్ సేవలు ద్వారా మాత్రమే ఇసుక సరఫరా నిర్వహిస్తామని,ఈ అవకాశాన్ని నిర్మాణ రంగం వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. మండలంలోని నారాయణపురం పంచాయతీ, జగన్నాధపురం సమీపంలో గల  ఇసుక రీచ్ ను ఆయన శనివారం ప్రారంభించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన ఇసుక పాలసీ విధానం వల్ల ఇసుక ఇక నుంచి చౌక ధరకు లభించ నున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వార ఆధునాతన సాఫ్ట్వేర్ను రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం జగన్నాధపురం లో ఇసుక రీచ్ ద్వారా ఇసుక లభ్యం అవుతుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆయా రీచ్ లు లో ఇసుక రవాణా చేసేందుకు అవకాశం ఉందన్నారు. నిర్దేశించిన సమయంలో కాకుండా ఇతర సమయాలలో ఇసుక రవాణా చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.ఇసుక రీచ్ లు వద్ద ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. స్యాండ్ టాక్స్ విధానంలో ఎక్కడి నుంచైనా ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రం మే అవకాశం ఉంటుందని, ఇసుక కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి, ట్రాక్టర్ యజమానికి, డ్రైవర్ సెల్ కు మేసేజ్ చేరడంతో పాటు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ జీ పీ ఆర్ఎస్ విధానాన్ని అనుసంధానం చేయడం ద్వార ఇసుక రవాణ చేసే ట్రాక్టర్ ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుసుకునేందుకు విలు ఉంటుందని అన్నారు. ఇసుక రవాణా కు సంబంధించి చెల్లింపులు ఆన్లైన్ విధానం ద్వారానే జరుగుతాయని, నేరుగా చెల్లింపులు లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్యాండ్ రీచ్ ఆఫీసర్ రాము,జూనియర్ పంచాయితీ సెక్రటరీ మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love