– 17910 కుటుంబాలు… 17265 గృహాలు..
నవతెలంగాణ అశ్వరావుపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువలోకి తేవడానికి, ప్రభుత్వం యొక్క ఆరు హామీలను నెరవేర్చేందుకు గాను డిసెంబర్ 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 వరకు(8) రోజులు పాటు మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని ఎం.పి.డి.ఒ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
గ్రామసభల నిర్వహణకు గాను అశ్వారావుపేట మండలంలో (5) గురు అధికారులు మండల స్థాయి అధికారులతో ఏడుగురు (7) సభ్యులు ఉండే విధంగా (5) అయిదు బృందాలను ఏర్పాటు చేసామని ఆ బృందాలకు తహశీల్దార్ వి.క్రిష్ణ ప్రసాద్, ఎం.పి.డి.ఒ జి.శ్రీనివాసరావు, ఎం.పి.ఇ.ఒ సీతారామరాజు,వ్యవసాయాధికారి వై.నవీన్,ఐ.బి ఏఈ కేఎన్బీ క్రిష్ణ లు నాయకత్వం వహిస్తారు అని అన్నారు.
అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించుటకు ముందు రోజున గ్రామపంచాయతీ వారు సరఫరా చేసిన నిర్ణీత దరఖాస్తు ఫారం ను నింపి ఉంచుకొని, అట్టి దరఖాస్తు న కు ఆధార్ కార్డు,రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్ల జిరాక్స్ ప్రతులను జతచేసి గ్రామసభ జరిగే రోజున కౌంటర్ నందు సమర్పించి రసీదు ను పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. గ్రామసభల గ్రామసభ నిర్వహణకు అవసరమగు టెంట్లు, కుర్చీలు, బల్లలు, త్రాగునీరు కౌంటర్ ల ఏర్పాట్లను సంబంధిత గ్రామపంచాయతీ పాలక వర్గం సమకూర్చు తుంది అని అన్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో జరుగు గ్రామసభ ఉదయం 8 గంటల నుండి 12గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును ఇట్టి గ్రామసభల కు అందరు గ్రామస్తులు, అన్ని శాఖల గ్రామ, మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, యం.పి.టి.సి సభ్యులు, అధ్యక్షులు,మండల ప్రజా పరిషత్ పాలకవర్గం హాజరు కావాలని కోరారు.
ప్రజాపాలన షెడ్యూల్డ్ ఇదే….
ఆరు రోజులు పాటు జరిగే ప్రజా పాలన కార్యక్రమానికి ఒక్కో రోజూ 5 పంచాయితీలు చొప్పున నిర్వహించనున్నారు. 28 వ తేదీ న అచ్యుతాపురం,రామన్నగూడెం,పాత రెడ్డి గూడెం,మొద్దులు మడ, కేసప్పగూడెం
29 వ తేదీ న మద్దికొండ,పాత అల్లి గూడెం,నందిపాడు,అనంతారం,జమ్మిగూ
30 వ తేదీన నారంవారిగూడెం కాలనీ,గుర్రాలుచెరువు,కొత్త మామిళ్ళ వారిగూడెం,మల్లాయి గూడెం,బచ్చువారి గూడెం.
2 వ తేదీ జనవరి 2024న నారంవారిగూడెం, వేదాంతపురం, గాండ్
3 వ తేదీన అశ్వారావుపేట, పేరాయిగూడెం, ఆసుపా
4 వ తేదీన అశ్వారావుపేట, పేరాయిగూడెం, తిరు
5 వ తేదీన అశ్వారావుపేట, పేరాయిగూడెం, వినాయకపురం, నారాయణపురం, ఊట్లపల్లి.
6 వ తేదీన అశ్వారావుపేట, పేరాయిగూడెం, వినాయకపురం, నారాయణపురం, ఊట్లపల్లి.