– పట్టించుకోని పంచాయతీ అధికారులు
– నిధులు లేవు అంటున్న ఎంపీఓ
నవతెలంగాణ-చర్ల
చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడిగా మారి దుర్గంధం వెదజల్లుతూ దోమలు, ఈగలు ప్రబులుతున్నా పంచాయతీ అధికారులు మీనా మీసాలు లెక్కించడం, ప్రజలు ఎన్ని మారులు చెప్పినా పట్టించుకోవట్లేదని మండల పరిధిలోని గుంపెనగూడెం గ్రామవాసులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వలన మా గ్రామంలో పారిశుద్ధ్యం పడకే సిందని గ్రామవాసులు పెదవిరుస్తున్నారు. ఒకపక్క ఉన్నతాధికారులైన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో సైతం ఇంటింటికి తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిలువలు లేకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు రాకుండా వైజాగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉంటే మండల పరిధిలోని కేసాపురం పంచాయతీ పరిధి గుంపెనగూడెంలో దీనికి విరుద్ధంగా ఎక్కడ మురికి అక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న కార్యదర్శి నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నాడని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి ఎన్నిమార్లు ఫోన్ చేసినా ఫోన్‌కు అందుబాటుకు రాకుండా ఉండడం కోస మెరుపు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మీద సైతం మురికి నీరు నిలిచి ఉండడం ఆ మురికి నీటి పై దోమలు లార్వాలు పెట్టడం వేల కొద్ది దోమలు ప్రబలి గ్రామస్తులను కొట్టడం వలన ఆ గ్రామవాసులు గతంలోనూ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా బారిన పడటం జరిగింది. చర్ల మండల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి నక్కిబోయిన శ్రీనివాస్ యాదవ్ సైతం గత ఏడాది ఈ వర్షాకాలంలో డెంగ్యూ జ్వరంతోనే మృతి చెందాడు. ఇలా ఎంతమంది ప్రాణాలు పోయినా పంచాయతీ కార్యదర్శి మాత్రం గ్రామంలో ఏనాడు బ్లీచింగ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించిన దాఖలాలు లేవు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. కార్యదర్శి కాలక్షేపానికి తన ఉద్యోగాన్ని చేస్తున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. కేవలం పంచాయతీ కార్యదర్శి అలసత్వం వలనే ఆ గ్రామంలో మురికి పెరిగిపోతుందని పలువురు మండిపడుతున్నారు. చిన్న పంచాయతీ ఉన్న నిధులను చక్కగా సద్వినియోగ పరుచుకుంటూ పాలన చేపట్టవచ్చు. కార్యదర్శి స్థానికంగా ఉండకుండా భద్రాచలం నుండి వచ్చినరోజు వచ్చి రాని రోజు రాకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా అస్తవ్యస్తంగా పంచాయతీని తయారు చేశాడని పలువురు నిప్పులు చెరుగుతున్నారు.
నిధులు లేమితో పనులు సాగటం లేదు : ఎంపీఓ వలీ హజరత్
ఏ చిన్న పని చేయించాల్సినా నిధులు అవసరం ఉన్నందున ఏ పనికీ ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. చాలాకాలంగా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. ఏదేమైనా సంబంధిత కార్యదర్శి ద్వారా గుంపెన గూడెంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సత్వరమే ప్రయత్నిస్తాను.
రోడ్డు కిరువైపులా మురికి నీరుతో నానా అవస్థలు పడుతున్నాం
మా గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా బురద పేరుకుపోవడం దాని వలన బురద నీరు నిల్వ ఉండడం దాని వలన దోమలు, ఈగలు అధికంగా ప్రబలి అనారోగ్యం పాలవుతున్నాం. గ్రామంలో కార్యదర్శి ఏ రోజు పర్యటించకపోవడం వలన పారిశుద్ధ్యం పడ కసింది. గ్రామంలో తాగునీటికి ఇక్కట్లు ఏర్పడు తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి మా గ్రామంలో ఉన్న మురికిని వదిలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
– డీసీసీబీ డైరెక్టర్ పోలిబోయిన నాగేశ్వరరావు