Saturday, June 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

- Advertisement -

సీఎం సలహాదారుడిగా రామకృష్ణారావు
మొత్తం 13 మంది ఐఏఎస్‌‌ల బదిలీ..ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ సంజయ్‌ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె.రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన్ను సీఎం సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో రామకృష్ణారావు స్థానంలో సంజయ్‌ జాజు సీఎస్‌‌గా నియమితులయ్యారు. కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన్ను తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫ రాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం 13 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు బాధ్యతలు అప్పగించింది.

అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించిన ప్రభుత్వం.. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌ నియమితులయ్యారు. రెవెన్యూ శాఖ (విపత్తు నిర్వహణ) ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను, ప్రభుత్వ (మైన్స్ అండ్ జియాలజీ) కార్యదర్శిగా ఎం.రఘునందన్ రావును, ఇన్వెస్ట్ తెలంగాణ, ఐ అండ్ సి డిపార్ట్ మెంట్ సీఈవోగా బి.అజిత్ రెడ్డిని నియమించారు. టీజీరెడ్కో వీసీ అండ్ ఎండీగా మహమ్మద్ ముషారఫ్ అలీ పారూఖీ, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ప్రత్యేక కార్యదర్శిగా పి.కాత్యాయని దేవి, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కె.గంగాధర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గా టి.వెంకన్న, టూరిజం డైరెక్టర్ గా కె.విద్యాసాగర్ నియమితులయ్యారు. విద్యాసాగర్ సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కె.చంద్రకళకు హెచ్ ఎండీఏ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్ అండ్ మెట్రో రైల్) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారిగా వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌ను నియమించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -