Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలు కుటుంబానికి సర్పంచ్ చేయూత

మృతురాలు కుటుంబానికి సర్పంచ్ చేయూత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం పోచమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు శనివారం మృతురాలు కుటుంబాన్ని గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు పరమర్శించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం తమవంతుగా రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -