చర్చి నిర్మాణానికి సర్పంచ్‌ విజయలక్ష్మి రాచయ్య రూ.50 వేల ఆర్థికసాయం

నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని కోటమర్పల్లి గ్రామంలో మెతడిస్ట్‌ చర్చిపునర్నిర్మాణంలో భాగంగా గ్రామ సర్పంచ్‌ బి.విజయలక్ష్మి రాచయ్య రూ.50 వేలు ఆదివారం విరాళంగా ఇచ్చారు. సిరిపురం రఘుపతి రెడ్డి పీఎసీఎస్‌ మాజీ చైర్మన్‌, తమ్మలి కృష్ణయ్య రిటైర్డ్‌ బీఆర్‌ఓలు మరో రూ.10 వేలను విరాళాన్ని మెథడిస్ట్‌ సంఘ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్‌, సిర్గనగారి నర్సింహారెడ్డి మాజీ పిఎసిఎస్‌ డైరెక్టర్‌, ఎంటూరి ప్రతాప్‌ రెడ్డి రిటైర్డ్‌ ఏఎస్‌ఐ, బుసనగారి మధుసూదన్‌ రెడ్డి, చామల జైహింద్‌ రెడ్డి వార్డ్‌ మెంబర్‌, బుసనగారి సురేందర్‌ రెడ్డి, నాయక్‌ వాడి తహసీన్‌ బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు, ఈడిగి శ్రీశైలం గౌడ్‌, కావాలి నర్సింహ, అప్కని నర్సిములు మాజీ ఉపసర్పంచ్‌, జుంజూరు రత్నయ్య, తుడుము యేసయ్య, మర్పల్లి మల్లయ్య, అప్కని కిష్టయ్య, అప్కని అశోక్‌, పోచారం జైకుమార్‌, జుంజూరు నర్సిములు, అప్కని మధు, తుడుం సుభాన్‌, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love