విద్యార్థి సంఘం నాయకులపై కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలి: సతీష్

నవతెలంగాణ – గాంధారి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  అధ్యక్షుడు ఎం. వెంకటరెడ్డి తదితరులపైన బనాయించిన పూసపల్లి కుట్ర కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారుగాంధారి మండల కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియచేసారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వెంకటరెడ్డి తదితరుల పైనా ఇల్లందు పోలీసులు పూసపల్లి కుట్రకేసును మోపడాన్ని  ఉపాధ్యక్షుడు సతీష్ ఖండించారు. తక్షణమే కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులపైన మోపిన తప్పుడు కేసులను మొత్తం ఎత్తివేస్తామన్నారు. కాని దానికి విరుద్ధంగా విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణలో పీడీఎస్ యూ అగ్రభాగాన నిలిచిన సంగతి జగమెరిగిన సత్యం,1974లో ఏర్పడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) దేశంలో శాస్త్రీయ విద్యా విధానం రూపొందించాలని,కామన్ విద్యా విధానం కోసం పోరాడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ అందరికీ అందుబాటులో ఉండే విద్య కొరకు కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడుతుంది. పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు అనేక సమస్యలపై పోరాటాలు చేసిందాన్నారు  రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వెంకటరెడ్డి తదితరులపైన కావాలని పూసపల్లి కుట్రకేసు చేర్చడం సరైనది కాదని, తక్షణమే తప్పుడు కేసును ఉప సంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం మోపిన తప్పుడు కేసులో నుండి పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి వెంకట్ రెడ్డి  పేరు ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మోజీ రామ్ నాయకులు సుమన్,ప్రవీణ్, బాను తదితరులు పాల్గొన్నారు.
Spread the love