అస్వస్థత లేదు..ఎం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఇవాళ ఆయన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. డాక్టర్లకు సమాచారం అందించారని.. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరని ఇలా రకరకాల వార్తల వినిపించాయి. దీంతో తాను ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తాను బాగానే ఉన్నానని వీడియో రిలీజ్ చేశాడు ఎమ్మెల్యే కొడాలి నాని.. నాని అస్వస్థతకు గురయ్యారని కొంత సేపటి క్రితం వార్తల వైరల్ కావడం గమనార్హం.

Spread the love