సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

– థాయ్‌లాండ్‌ ఓపెన్‌ 2024
బ్యాంకాక్‌: సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి చేరుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో 21-7, 21-14తో మలేషియా షట్లర్లపై ఏకపక్ష విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో నాల్గో సీడ్‌ తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్ప జంట 21-15, 21-23, 21-19తో ఆరో సీడ్‌ దక్షిణ కొరియా షట్లర్లపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. మెన్స్‌ సింగిల్స్‌లో క్వాలిఫయర్‌ లువాంగ్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్‌ కునాల్‌విట్‌ చేతిలో 12-21, 20-22తో పరాజయం పాలయ్యాడు.

Spread the love