మాజీ డీ ఆర్ డీఏ పీడీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

– కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు..
– దళిత ఉద్యోగస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు..కేవీపీఎస్
నవతెలంగాణ – చివ్వెంల
గతంలో సూర్యాపేట జిల్లా డిఆర్డిఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ పై కేవీపీఎస్ పోరాట ఫలితమే చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో చివ్వెంల మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనికి సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన సామాజిక తనిఖీ సభలో ఉపాధి హామీ ఏ పి వో గా  పనిచేస్తున్న దళిత అధికారి ఇరుగు నాగయ్యను డి ఆర్ డి ఎ పి డి కిరణ్ కుమార్ సభలో  అవమానపరిచే విధంగా, దళిత ఉద్యోగి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా నీకు ఈ వేదిక మీద కూర్చునే అర్హత లేదు వేదిక దిగి క్రింద కూర్చొ పో అంటూ మండలంలోని ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది అందరి ముందు అవమానించడం జరిగింది.అందుకుగాను అప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకో లేదు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళిత ఉద్యోగిని అవమానపరిచి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరించిన పిడి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తదానంతరం  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్,జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ లకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసింది. కెవిపిఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు  ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పి డి ఫై చివ్వెంల పోలిస్  స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది.దళిత ఉద్యోగులను అవమాన పర్చిన, వేధింపులకు గురి చేసిన కె వి పి ఎస్ అండగా ఉంటుందని  కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తెలిపారు.
Spread the love