ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ కులాలు ఏకమై అగ్ర కులాలను ఓడగొట్టాలి..

– బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్..
నవతెలంగాణ- సూర్యాపేట
అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సి, ఎస్టీ,బిసి, మైనారిటీ కులాలు  ఏకమై అగ్ర కులాలను ఓడగొట్టాలని బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆత్మకూరు(s) మండలంలోని కందగడ్ల గ్రామానికి చెందిన బొల్లె సైదులు, స్వర్ణలత, ప్రసాద్ తో పాటు మరో 100 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిఎస్పి లో చేరిన సందర్భంగా శనివారం స్థానిక పార్టీ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాల నాయకుల బహుజనులను అణగదొక్కుతున్నారని వారిని వారిని ఎదుర్కొనేందుకు పలువురు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.నవ సమాజ స్థాపన కోసం బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అధ్యక్షులు నకరికంటి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ వట్టే రేణుక,చాంద్ పాషా,బద్దం అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love