సెబీ షోకాజ్‌ నోటీసులు అర్థరహితం..

నవతెలంగాణ – న్యూఢిల్లీ : సెక్యూరిటీ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నుండి షోకాజ్‌ నోటీసులు అందాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ మంగళవారం తెలిపింది. ఈ షోకాజ్‌ నోటీసులు అర్థరహితమని హిండెన్‌ బర్గ్‌ పేర్కొంది. ముందుగా నిర్దేశించిన ప్రయోజనాల కోసం రూపొందించబడింది.. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు చేసిన అవినీతిని, మోసాన్ని బహిర్గతం చేసే వారి గొంతుకను నొక్కేందుకు, భయపెట్టే ప్రయత్నంగా పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ అదానీని తగ్గించడానికి డజన్ల కొద్దీ సంస్థలతో కలిసి వందల మిలియన్ల డాలర్లు సంపాదించిందా.. లేదు కదా .. అని పేర్కొంది. అదానీతో తమ పని ఆర్థిక లేదా వ్యక్తిగత భద్రతా దృక్కోణం నుండి ఎప్పుడూ సమర్థించబడదని, కానీ తాము చాలా గర్వించదగిన పని చేశామని పేర్కొంది. సెబీ నుండి జూన్‌ 27న ఇమెయిల్‌ వచ్చిందని తెలిపింది. ఈ రోజు వరకు, తమ నివేదికపై స్పందించడంలో అదానీ విఫలమయ్యారని, బదులుగా తాము లేవనెత్తిన ప్రతి కీలక అంశాలను పక్కకు పెట్టి, మీడియా ఆరోపణలను తిరస్కరిస్తూ సమాధానమిచ్చారని పేర్కొంది. కోటక్‌ లేదా మరే ఇతర కోటక్‌ బోర్డ్‌ సభ్యుని గురించి సెబీ ప్రస్తావించకపోవడం భారతీయ వ్యాపారవేత్తను రక్షించేందుకు ఉద్దేశించడిందని తాము అనుమానిస్తున్నామని, ఈ ప్రాతను సెబీ స్వీకరించినట్లు అనిపిస్తుంది అని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. అదానీ కంపెనీలు అనేక ఆర్థిక మోసాలకు పాల్పడాయని హిండెన్‌బర్గ్‌ ఇటీవల ఓ నివేదికను ప్రచురించిన సంగతి తెలిసిందే.

Spread the love