- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ సమరం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను, రెండో, చివరి విడతలో 142 స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 93.17 శాతం ఓటింగ్ నమోదు కావడంతో రెండో విడతలో కూడా భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. ఉదయం నుంచే పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏప్రిల్ 23న ఉత్తర బెంగాల్‌లోని 152 నియోజకవర్గాల్లో జరిగిన మొదటి విడత పోలింగ్‌లో నమోదైన అధిక ఓటింగ్ శాతం తమకు అనుకూలమని టీఎంసీ, బీజేపీ రెండు పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
- Advertisement -



