Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు విస్తరణ పేరిట కక్షసాధింపు

రోడ్డు విస్తరణ పేరిట కక్షసాధింపు

- Advertisement -


తమ ఇండ్లను కూల్చొద్దంటూ దళితుల నిరసన
నవతెలంగాణ-చేర్యాల

సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇండ్లను కూల్చివేసే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ దళితులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..పట్టణానికి ప్రత్యేకంగా బైపాస్ రోడ్డు అందుబాటులో ఉన్నప్పటికీ కావాలనే కొందరు రాజకీయ నాయకులు కక్షపూరితంగా ఈ చర్యలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. 40 ఏండ్లుగా ఇక్కడే స్థిరపడి నివాసం ఉంటున్న నిరుపేద దళితుల ఇండ్లను కూలగొట్టి, వారిని రోడ్డున పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి బైపాస్ రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ, నివాస ప్రాంతాలలో రోడ్డు విస్తరణ పేరిట ఇండ్లను తొలగించడం వెనుక రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి లేదని విమర్శించారు. దళితుల నివాస ప్రాంతాలలో ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ పనులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఉన్న బైపాస్ రోడ్డును వినియోగించుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -