రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
నలుగురు కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని గొంతు కోసి మరో ముగ్గురు కూలీలు అక్కడ నుంచి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టు బాబు అనే వ్యక్తి స్థానికంగా ఒక భవన నిర్మాణంలో కార్మికునిగా పని చేస్తున్నాడు. కాగా, బుధవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక రూమ్‌లో గంజాయి తాగుతున్నాడు. ఆ సమయంలో నలుగురు మధ్య ఘర్షణ జరిగింది. ముగ్గురు వ్యక్తులు మిట్టు బాబుపై దాడికి దిగారు. దాంతో అతను కూడా ఆ ముగ్గురిపై ప్రతిఘటించి దాడి చేశాడు. ఆ సమయంలో ఆ ముగ్గురూ మిట్టు గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యారు. గాయాలతో ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న మిట్టు బాబును వెంటనే 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
నలుగురు కూలీల మధ్య ఘర్షణ వ్యక్తి గొంతు కోసి పరారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



