– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట్‌రాములు
నవతెలంగాణ-పరిగి
లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక, శక్తులను గెలి పించాలిని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు ఆర్. వెంకట్‌రాములు అన్నారు. సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పరిగి పట్టణ కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం సామా జికంగా, ఆర్థికంగా వెనుకబడిన వెనుకబడిందన్నా రు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలూ అనేక సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. అన్ని పార్టీల నాయ కులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. పాలకులు ప్రజల కీలకసమస్యలు పరిష్కరించకుండా దాటవేస్తున్నారని తెలిపారు. పరిగి నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ని రంతరం ప్రజాల తరుపున ప్రజా సమస్యలపై పోరా డుతూ ప్రజలకు, కార్మిక వర్గానికి, రైతులకు అండగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా రాజకీ య పార్టీలు అనేక హామీలు మేనిఫెస్టోలో చేర్చి వాటి ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నా రని విమర్శించారు. పరిగి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ మతోన్మాదం పార్టీని ప్రజలు బలపర చరాదని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలం బిస్తుందన్నారు. ఈ విధానాలను పక్కదారి పట్టిం చడానికి అనేక విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించి మ త రాజకీయాలు చేస్తున్నదన్నారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజలను విభజిం చి పాలిస్తుందని తెలిపారు. దేశ ఐక్యతను దెబ్బతీసే బీజేపీని దాని మిత్రపక్షలను ఓడించాలని పిలుపు ని చ్చారు. పరిగి నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సాగుభూమి సమస్యలు, ధరణి వంటి, రైతుల, మహిళాల, వికలాంగుల, నిరుద్యోగుల, వి ద్యార్థిల సమస్యలపై, అన్ని వర్గాల ప్రజ సమస్యలూ పరిష్కరించాలని నిరంతరం పోరాటం చేస్తుందన్నా రు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ..ప్రస్తుత ఎన్నికలలో పరిగి నియోజక వర్గంలో లౌకిక, ప్రజాతంత్ర, సామాజిక, పోరాట, శక్తుల అభ్యర్థులను బలపరచాలని సీపీఐ(ఎం) పిలు పు ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని వర్గాల సమస్యలనూ పరిష్కరించే దిశగా పనిచేస్తారో అలాంటి అభ్యర్థుల ను సీపీఐ(ఎం) బలపరుస్తాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.మహిపాల్, బుస్స చంద్రయ్య, కే.శ్రీనివాస్, యూ.బుగ్గప్ప, రామ కృష్ణ, సుదర్శన, ఎండీ.హబీబ్, ఎV్‌ా.సత్తయ్య, రఘు రామ్, శేఖర్, లాలయ్య, రమేష్, యాదగిరి, లాల ూయ్య, తదితరులు పాల్గొన్నారు.