- Advertisement -
ట్రంప్, నెతన్యాహూ అంగీకారం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య శుక్రవారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. సమీప భవిష్యత్తులో అమెరికాలో భేటీ అయ్యేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఆ ప్రకటన వివరించలేదు. అమెరికా వ్యవస్థాపక వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రంప్‌ను నెతన్యాహూ అభినందించారు. ఇటీవలి కాలంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్-హిజ్బొలా మధ్య ఘర్షణల నేపథ్యంలో నెతన్యాహూపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -



