నకిలీ సిగరెట్లు పట్టివేత

– నలుగురు వ్యక్తుల అరెస్ట్‌
– సిగరెట్లు తరలిస్తున్న కంటైనర్‌ స్వాధీనం
– విలువ1 కోటి 48 లక్షలు
– పరారీలో సరఫరాదారుడు
నవతెలంగాణ-శంషాబాద్‌
నకిలీ సిగరెట్లు పట్టుకున్న ఘటన శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ బాలరాజు తెలిపిన వివరాల ప్రకా రం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గగన్‌ పహాడ్‌లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సిగరెట్లు తరలిస్తున్న విషయంపై నిర్దిష్ట సమాచారం పోలీసులకు అందింది. అప్రమత్తమైన ఎస్‌ఓటి పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సం యుక్తంగా నకిలీ సిగరెట్ల లోడుతో వస్తున్న కంటైనర్‌ లారీ ని పోలీసులు పట్టుకున్నారు. నకిలీ సిగరెట్ల రవాణాలో భా గస్వాములైన సిగరెట్లు రవాణా చేయు వ్యక్తి బీహార్‌ రాష్ట్రం ముజాఫర్‌పూర్‌కు చెందిన రవికాంత్‌ కుమార్‌, హర్యానా సర్దార్‌ మండల్‌ అద్వార్‌ గ్రామానికి చెందిన కంటైనర్‌ డ్రైవ ర్‌ మహమ్మద్‌ షాహజాద్‌, క్లీనర్‌ ముబ్రిక్‌ ఖాన్‌, హైదరా బాద్‌ శాలిబండ చెందిన స్థానిక ట్రాన్స్‌ పోర్టర్‌ సయిద్‌ ఇలియాసుద్దిన్‌, బిహార్‌ రాష్ట్రంలోని గయా ప్రాంతానికి చెందిన నకిలీ సిగరెట్ల పంపిణీ దారుడు సుభాష్‌, (తప్పించుకున్న వ్యక్తి), నకిలీ సిగరె ట్లు కొనుగోలు చేసిన వ్యక్తిహైదరాబాదులోని కిషన్‌బాగ్‌కు చెందినకు చెందిన రేహన్‌ఖాన్‌ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచా రిస్తున్నారు. వీరి వద్ద నుంచి సిగరెట్లు తరలి స్తున్న కంటైనర్‌తో పాటు రూ. 1 కోటి 48 లక్షల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love