పీఎంఎఫ్ఎంఈ లబ్ధిదారుల ఎంపిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండంలోని రాంపూర్ డి, దర్మారం బీ గ్రామ సంఘాలకు చెందిన పిఎంఎఫ్ఎంఈ లబ్ధిదారులకు నూతన ఉపాధి వ్యాపారాలను బుధవారం ప్రారంభించినట్లు మండల సమాఖ్య ఎపియం రజిత తెలిపారు. రాంపూర్ సంఘానికి చెందిన నల్లవెల్లి సౌమ్య, భవాని మహిళా సంఘం నుండి పీఎంఎఫ్ఎంఈ కింద కట్టెగానుక మిషన్పై 250000లు, యూనిట్ కాస్ట్ ఇవ్వగా, ఈ యూనిట్ను బుధవారం డిఅర్డిఓ డిఅర్డిఎ పిడి చందర్ నాయక్  ప్రారంభించారు. ధర్మారంకు చెందిన డి. అనసూయ ఫ్లోర మిల్ మిషన్కై రూ.1,00,000లు యూనిట్ కార్డు ఇచ్చి ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో సీసీ సురేష్, నాగరాజు, స్వప్న, ఎంఎస్ఎ అనిల్ పాల్గొన్నారు.
Spread the love