షూటింగ్‌ ప్రాబబుల్స్‌ ఎంపిక

షూటింగ్‌ ప్రాబబుల్స్‌ ఎంపిక– ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ షురూ
న్యూఢిల్లీ : పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత తరఫున గురి ఎక్కుపెట్టేదెవరో తేల్చేందుకు భారత రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) సిద్ధమైంది. 2024 ఒలింపిక్స్‌కు భారత్‌ 16 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీపడేది జాతీయ సెలక్షన్‌ ట్రయల్స్‌తో సెలక్షన్‌ కమిటీ తేల్చనుంది. 16 స్థానాల కోసం 37 మంది షూటర్లు పోటీపడతారని ఎన్‌ఆర్‌ఏఐ బుధవారం ప్రాబుబుల్స్‌ను ప్రకటించింది. శుక్రవారం నుంచి న్యూఢిల్లీలో ట్రయల్స్‌ షురూ కానుండగా.. ఈషా సింగ్‌, మను భాకర్‌, రిథమ్‌ సంగ్వాన్‌ వంటి స్టార్‌ షూటర్లు బరిలో ఉండనున్నారు. ఓవరాల్‌గా నాలుగు ట్రయల్స్‌ అనంతరం ఉత్తమ షూటర్లను ఒలింపిక్స్‌కు పంపించనున్నారు.

Spread the love