జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న శేషాద్రి

నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అందించే జిల్లా ఉత్తమ అవార్డులల్లో భాగంగా  జిల్లా ఉత్తమ ఎంపీడీవో గా మండలంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న శేషాద్రి కి ఉత్తమ అవార్డు లభించింది. ఈ సందర్భంగా  ఎంపీడీవో శేషాద్రి మాట్లాడుతూ ఈ అవార్డు నాకు రావడం నాకు ఇంకా మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. అవార్డును జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ చేతుల మీదుగా శుక్రవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించడం, సేవా దృక్పథం, ఉద్యోగుల సహకారం వల్లే తనకు అవార్డు లభించింది అన్నారు. అవార్డు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. తనకు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అవార్డు రావడం పట్ల ఉద్యోగులు సిబ్బంది హర్ష వ్యక్తం ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love