రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – బొమ్మలరామరం 

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం అవుతుందని, గత ప్రభుత్వ అనవాతీనే కోసాగిస్తున్నారని అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసింది, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం7.8% మాత్రమే కేటాయించింది. అంటే విద్యారంగానికి రూ.21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం రూ.2,296 కోట్లు విద్యారంగానికి పెరిగినట్లు ఉన్నా, మొత్తం బడ్జెట్ పోల్చినప్పుడు పెరిగింది ఇది చాలా తక్కువ. గత విద్యారంగ బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 1.31 % మాత్రమే పెంచారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్యయే మాత్రం అభివృద్ధి కాదని అన్నారు. నిధులను పెంచి‌ ప్రభుత్వ విద్యారంగాని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు గణేష్,రాజశేఖర్,భారత్,జశ్వంత్,సంపత్,రాజేష్ తదతరులు పాల్గొన్నారు.
Spread the love