నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి: ఎస్ ఎఫ్ ఐ

– ఛలో చెన్నై కి తరలిన ఎస్ ఎఫ్ ఐ బృందం
నవతెలంగాణ – కంటేశ్వర్ 
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చలో చెన్నైకి ఎస్ఎఫ్ఐ బృందం మంగళవారం తరలి వెళ్ళింది. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)  దక్షిణాది రాష్ట్రాలలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఛలో చెన్నై పిలుపకు తరలిన ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ బృందం. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  బొడ అనిల్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని. ఇలాంటి జాతీయ విద్యా విధానం విపత్తు గా మారిందని అవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ప్రైవేటీకరణ కు, కార్పొరేటికరణ కు వత్తాసు పలుకుతుంది  అని అన్నారు. అదేవిధంగా పి హెచ్ డి స్కాలర్లకు వచ్చే స్కాలర్షిప్స్ లలో కోతలు విధిస్తుందని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది గలాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం కోసం అఖిలభారత స్థాయిలో 16 విద్యార్థి సంఘాలుగా ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. విద్య రంగానికి వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మహేష్, దీపిక నాయకులు వేణు,జవహర్,సందీప్, బాపు రావు, సురేష్, పూజా, అభిషేక్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love