కారాగారంలోనూ ‘ఆమె’కు వివక్షే!

In prison
Discrimination to 'her'!ఫలానా దేశ పౌరులు అంటే వారికి ఆ దేశ రాజ్యాంగం గుర్తింపును, హక్కులను కలిపించటమే కాక ఆ దేశ ప్రభుత్వం వారికి సామాజిక, ఆర్ధిక సం రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఈ పౌరసత్వం పుట్టు కతో, పెళ్లి ద్వారా, లేదా ఒక అప్లికేషన్‌ ప్రాసెస్‌ ద్వారా గాని పొందే అవకాశం ఉంటుంది. సాధారణం గా దేశంలో ఉన్నత వర్గాలకి అధికార కులాలకి మెజారిటీ మతాలకి చెందిన సిస్‌-పురుషులకి పౌర సత్వం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉం డదు, ఎందు కంటే వారి పౌరసత్వం గురించి వారి గ్గానీ, అలాగే వేరే వాళ్ళగానీ ఎటువంటి సందేహాలు ఉండవు, ‘మేమీ దేశ పౌరులమేనా ‘ అన్న సంశయం వారికెప్పుడూ రాదు.
కానీ ఈ దేశంలో చాల మంది వారి రోజువారీ జీవితం ఈ సంశయం తోనే నడుస్తుంది. పుట్టుకతో పౌ రసత్వం ఉన్నప్పటికీ పౌరులుగా గుర్తింపు గాని, దాని వల్ల వచ్చే అధికారాలు, హక్కులు ఏమి పొందని సమూ హాలు ఎన్నో వున్నాయి. ఒకవేళ హక్కులు, అధికారాలు చట్టాలు కల్పించినా, సమాజంలోని మత, కుల, ప్రాంతీయ, లింగ, అనేక రకాల అసమానతలు, వివక్ష కారణంగా ఆ అధికారాలను, హక్కులను అను భవిం చలేక పోతున్నారు. వీరిలో దళితులు, ముస్లిం లు, క్రైస్తవులు, సిస్‌-జెండర్‌ స్త్రీలు, ఇంకా ఇతర సముదా యాల వారు వున్నారు. చట్టంలో సంరక్షణ, సమాజం లో ఏ రకమైన అనుకూల గుర్తింపు కూడా లేకుండా, అస్తిత్వం కారణంగానే చట్టాలలో నేర స్థులుగా పరిగణింపబడి లెస్బియన్‌, గే, బైసెక్సు వల్‌, ట్రాన్స్‌ జెండర్‌, ఇంటర్‌ సెక్స్‌, అసెక్సువల్‌, క్వియర్‌ సముదాయాలు పౌరసత్వ గుర్తింపు గాని, హక్కులు కాని లేని ప్రజల కోవలోకి వస్తారు. ఈ మధ్య కాలం లోనే వాళ్ళు ఈ చట్టాలను సవాలు చేస్తూ నేరస్తులు అనే ముద్రను తొలగించుకొని వారి హక్కులను గుర్తించి, పరిరక్షించాలని డిమాండ్‌ చేయడం మొదలు పెట్టారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏండ్లు గడి చిన తరువాత మొట్టమొదటి సరిగా ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులను పౌరులుగా గుర్తిస్తూ, పౌరులందరికీ వారి జెండర్‌ని వారే స్వీయ నిర్ధారణ చేసుకునే హక్కును కలిపిస్తూ 2014 ఏప్రిల్‌లో దేశ ఉన్నత న్యాయస్థానం నల్సా వర్సెస్‌ యూనియన్‌ అఫ్‌ ఇండియా కేసులో చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పులో అత్యు న్నత న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల హక్కులు, సంక్షేమానికి సంబంధించి నిర్దిష్ట మైన సూచనలు చేసింది. ఈ తీర్పు వచ్చి తొమ్మిడేండ్లు గడిచిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ఒకటి, రెండు మినహాయించి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్దగా ఏమీ చెయ్యలేదు. అది అలా ఉండగా 2016లో కేంద్ర ప్రభత్వం సమస్యాత్మకమైన మైన ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 ముందుకు తీసుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్‌ సముదాయాలు ఈ బిల్‌కి వ్యతిరేకంగా చేసిన ఎన్నో నిరసనల కారణంగా ఇందులో మార్పు లు తెచ్చి 2018లో దాన్ని లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. దీనిలో కమ్యూనిటీ కార్యకర్తలు ఇచ్చిన ఎన్నో సూచనలు ప్రభుత్వం పరి గణలోకి తీసుకోలేదు. జనరల్‌ ఎలక్షన్స్‌ రావడం వల్ల పార్లమెంట్‌తో పాటు ఈ బిల్‌ రద్దయింది.
2019లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరు వాత కేంద్ర ప్రభుత్వం వారు ఈ బిల్లును చట్టంగా చేసారు. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల అస్తిత్వం, హక్కులు, సంక్షేమం గురించిన అంశాలతో వున్న ఈ చట్టం వచ్చి ఇప్పటికి దాదా పుగా 3 ఏండ్లు అవుతున్నా, సమాజాన్ని పక్కన పెట్టండి, అసలు ప్రభుత్వ యంత్రాంగంలోగానీ, అధి కారులలో గానీ ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల పట్ల గానీ, ఈ చట్టం పట్లగానీ అవగాహన మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడ చందంగానే వుంది. సమాజంలో ఎవరి నైనా మీకు ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు అంటే ఎవరో తెలుసా అంటే, ఆ! ట్రాఫిక్‌ సిగల్‌ దగ్గర చూసాం, ఆ ఫంక్షన్‌లో అడుక్కోవటానికి వస్తే చూసాం అంటారు! అంటే ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులు పుట్టిన ఇండ్లలో వుండరు, ఇరుగు పొరుగు ఇండ్లలో, మన రోజు వారి పరిసర ప్రాంతాలలో వుండరు, పనిచేసే చోట వుం డరు, ప్రజా రవాణా వాహనాల్లో కనిపించరు, పబ్లిక్‌ స్థలాల్లో వుండరు, అంటే ఒక పెద్ద సముదాయం మొ త్తాన్ని సమాజపు అంచుల్లోకి తోసి, కేవలం అణిచివే తకు, హింసకు గురయ్యే ప్రదేశాలకు పరిమితం చేసేసి వారి జీవితాన్నే జైలు జీవితంలా తయారు చేసారు!
ఇంకా విషాదమేమిటంటే, ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులు సమాజం కనుసన్నల్లోని వివక్ష అనే కారా గారంలో రోజువారీ జీవితం గడుపుతున్నప్పటికీ చట్టపరిధిలో నడిచే కారాగారాల్లో మాత్రం ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులకు వారి జెండర్‌కి అనుగుణంగా చోటులేదు. రెండు వారాల ముందు ఒక హిజ్రా స్త్రీ అక్టోబర్‌ 3న ఉదయం మూడు గంటలకు హైదరా బాద్‌లోని ఒక రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఆటు వైపుగా వెళ్తున్న రాత్రి పోలీస్‌ పెట్రోలింగ్‌ ఆమె ను ఏ కారణం లేకుండా జీపు ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారు, కేవలం ఒక హిజ్రా వ్యక్తిగా రాత్రి పూట రోడ్డు మీద నడవడమే ఆమె చేసిన నేరం! ఆమెకు తెలిసిన ఇంకో హిజ్రా వ్యక్తి అక్క డికి వెళ్లి పోలీస్‌ వాళ్ళతో మాట్లాడితే, ఆమె పర్సనల్‌ పూచికత్తు మీద సంతకం పెట్టించుకుని, ఆధార్‌ కార్డు కాపీ తీసుకొని వదిలేసారు, వదిలేస్తూ తరువాత కోర్ట్‌కి వెళ్లి జరిమానా కట్టండి అన్నారు. ఒక రోజు తరువాత పోలీస్‌ వాళ్ళు చెప్పినట్టు లోకల్‌ కోర్ట్‌కి పెనాల్టీ కట్టడా నికి వెళ్లారు. అక్కడ మేజిస్ట్రేట్‌ ముందు చుట్టూ వున్న వాళ్ళు ‘తప్పు ఒప్పేసుకో’ అని ఒత్తిడి చెయ్యడం వల్ల, ఆమె భయంతో ‘మాడం, తప్పు అయ్యింది’ అనేసింది. అంతే, ఆ మేజిస్ట్రేట్‌ ఆమెకి రూ.50 జరిమానా, మూడు రోజులు కారాగార శిక్ష వేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే. ఆ హిజ్రా స్త్రీని మేజిస్ట్రేట్‌ స్త్రీల జైలుకి పంపించమని ఉత్తర్వులు రాసినప్పటికీ, మెడికల్‌ పరీక్ష తరువాత, ఆమెకి స్థానాలు, పొడుగాటి జడ, స్త్రీల దుస్తులలో ఉన్న ప్పటికీ ఇంకా కింద సర్జరీ కాకుండా పురుషాంగం వుంది అన్న ఒకే ఒక్క కారణం చూపించి స్త్రీల కారాగార అధికా రులు ఆమెని పురుషుల జైలుకి పంపారు. కొంత మంది ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల హక్కుల కార్యకర్తలు వెళ్లి ‘మాకంటూ చట్టం వుంది, ఈ వ్యక్తి ఆధార్‌ కార్డులో ట్రాన్స్‌ జెండర్‌ అనే వుంది, తనని సిస్‌- పురుషుల కారాగారానికి ఎలా పంపు తారు?’ అని అడిగితే, ‘ఆ చట్టాలు ఎలా వున్నా సరే, మా పాలసీ ప్రకారం ఆమెని మహిళా కారాగారంలో పెట్టు కోవడానికి వీలు పడదు’ అని చెప్పారు.
2014 ఏప్రిల్‌లో నల్సా వర్సెస్‌ యూనియన్‌ అఫ్‌ ఇండి యా కేసులో సుప్రీమ్‌ కోర్ట్‌ శారీరక లింగానికి సంబంధం లేకుం డా వ్యక్తులు స్వయంగా వారి జెండర్‌ని నిర్దారించుకోవచ్చు అని, అలాగే ఆ జెండర్‌కి అను గుణంగా ఎలాంటి సర్జరీ చేయించుకోవాల్సిన అవ సరం లేదు అని స్పష్టంగా చెప్పింది. అంతేకాక 2019 లో కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల) పరిరక్షణ చట్టం 2019లో ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తి నిర్వచనం ఇది – ”పుట్టినప్పుడు ఇవ్వబడిన లింగంతో తనని తాను సరి పోల్చుకోని వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తి గా నిర్వచిస్తుంది. ఇందులో ట్రాన్స్‌-మెన్‌, ట్రాన్స్‌-ఉమెన్‌, (వారు లింగమార్పిడి చికిత్స లేదా హార్మోన్‌ రీప్లేస్మెంట్‌ చికిత్స లేదా లేసర్‌ చికిత్స లేదా అలాంటి ఇతర చికిత్సలు చేయించుకున్నారా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా) ఇంటర్‌ సెక్స్‌ వైవిధ్యాలు ఉన్న వ్యక్తులు, జెండర్‌-క్వియర్‌, కిన్నర్‌, హిజ్రా వంటి సామాజిక-సాంస్కృతిక గుర్తింపులు ఉన్న వ్యక్తులు ఉన్నారు.” 2014లోని తీర్పు వచ్చి దాదాపుగా దశాబ్దం, 2019 లోని చట్టం వచ్చి దాదాపుగా నాలు గేండ్లు అవుతున్న ప్పటికీ ప్రభత్వం లోని అనేక విభా గాలలో ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల హక్కులు, సంక్షేమా నికి సంబంధించి ఇప్పటికి ఒక ఆలోచన గానీ కనీసం ఊహ కూడా లేదు.
‘అర్ధరాత్రి స్వేచ్ఛగా స్త్రీలు రోడ్డుపై నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని గాంధీజీ ఏనాడో చెప్పారని విన్నాం. ఆ రోజుల్లో ఆయన కేవలం సిస్‌-జెండర్‌ మహిళల హక్కులను ఉద్దేశించి ఇలా అన్నారు! కానీ 75 ఏండ్ల రాజకీయ స్వాతంత్య్రం తరువాత కూడా ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు ఈ దేశ రూపకల్పనలో, వ్యవస్థలో ఇప్పటికి కూడా చోటు లేదు. ‘పాఠశాల, కళాశాలలో చదువుకోవాలంటే మేము ఎవరో దాచుకొని బతకాలి, బయటికి వెళ్లి బస్సు ఎక్కుదామంటే ముందు సిస్‌-మహిళలు, వెనక సిస్‌-పురుషులు వుంటారు. మాకు ఎక్కడ చోటుగాని, ఉద్యోగాలుగానీ లేవు, ఉపాధులు లేనే లేవు. కనీసం బయటికి వెళ్తే ఏ మరుగుదొడ్డి వాడాలి అన్నది కూడా కష్టమే! చివరికి మమ్మల్ని మేము గుర్తించుకునే జెండర్‌కి అనుగుణంగా జైళ్లల్లో కూడా చోటులేదు.’ ఈ ఒక్క ఉదాహరణ కేవలం ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల ఆవేదన గురించి మాత్రమే కాదు, మన ప్రభుత్వ వ్యవస్థ ఎలా పని చేస్తుందో ఆలోచించటానికి ఒక ఉదాహరణ.
రాజ్యవ్యవస్థలో ఒక ఉన్నత న్యాయస్థానం తీర్పు ను ఇస్తుంది, పార్లమెంట్‌ ఒక చట్టం తీసుకొస్తుంది, కానీ అవి దేశంలోని బలహీనమైన వర్గాలకు సంబం ధించినవి అయితే ఈ తీర్పులు చట్టాలు ఎవ్వరికి పట్టవు, కేవలం పుస్తకాలలో దుమ్ముపట్టి పోతాయి. ఏ విభాగం కూడా వెంటనే స్పందించి వచ్చిన తీర్పుకు అనుగుణంగా వారివారి డిపార్టుమెంటులలో మార్పు లు చేసుకునే ఆలోచన చేయదు. అంటే చాలా సంద ర్భాల్లో అణిచివేయబడ్డ వర్గాల వారు ఉద్యమాలు చేసి తీర్పులు, చట్టాలు తెచ్చుకున్నా, అవి వాస్తవికంగా హక్కుల రూపంలో మారటం లేదు. ఎన్నో సార్లు అధి కారులు దగ్గరికి వెళ్తే, ఈ చట్టం గురించి తె లీదు అంటే, ఆశ్చర్యం అనిపించినా వ్యక్త పర్చుకోలేక,చిరాకు అనిపించినా చెప్పే స్థితిలో లేక, వినిపించు కునే అధి కారి అయితే వారికి కొత్త చట్టం గురించి చెప్ప డం, లేదా వినే అధికారి కాకపోతే నిరాశతో వెను తిరి గిపోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే చేయాలి. ఎందుకంటే మన హక్కుల గురించి మనమే పోరాటం చేయాలి. ఆ పోరాట ఫలితంగా వచ్చిన చట్టాలకి సంబంధించి అధికారులకు నేర్పించాల్సింది మనమే, మన హక్కు లకు సంబంధించి పని జరిగేలా చూసుకోవాల్సింది కూడా మనమే! ఈ ప్రపంచంలో అందరూ అడ,మగ అనే రెండు లింగాలతో, జెండర్లతో పుడతారు అని, ఆ ఆడ, మగ మధ్యే లైంగిక ఆకర్షణ ఉంటుంది అనే అపోహలో జీవించే ఈ సమాజపు అజ్ఞానం ఉంది. దీనివల్ల ఎన్నో జీవితాలు హింసాపూరితమైన అణిచి వేతను ఎదుర్కొని జీవిస్తూ ఉంటే మన అధికార వ్యవ స్థ ఇవేమీపట్టని గాఢనిద్రలో ఇంకా ఎన్నాళ్లుంటుందో?
– తాషి చోడుప్‌

Spread the love