కరెంట్‌ అఫైర్స్‌

సుప్రీం కోర్టులో ప్రవేశానికి క్యూఆర్‌ కోడ్‌ ఈ పాస్‌ : న్యాయవ్యవస్థను ఆధునీకరించడానికి, క్రమబద్దీకరించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సి.జె.ఐ) జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ‘సుస్వాగతం’ పోర్టల్‌ ను ఆవిష్కరించారు. ఈ వినూత్న వేదిక న్యాయవాదులు, కక్షిదారులు, పౌరులకు క్యూఆర్‌ కోడ్‌ ఆదారిత ఈ పాస్‌ను పొందడానికి అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా సుప్రీం కోర్టు యొక్క గౌరవనీయమైన హాళ్లలోనికి ప్రవేశం కల్పిస్తుంది. ‘సుస్వ్రాగతం’ పోర్టల్‌ ప్రవేశ ప్రక్రియను క్రమబద్దీకరించడం, క్యూలను తగ్గించడం, సుప్రీం కోర్టు ఆవరణలో కొంత రహిత విధానాన్ని అవలంభించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
‘రాజమార్గయాత్ర’ యాప్‌ దేనికి సంబంధించినది? :
భారతీయ జాతీయ రహదారులపై అంతరాయం లేని ప్రయాణాన్ని అందించడానికి నేషనల్‌ హైవేస్‌ అధారిక్ణటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌.హెచ్‌.ఎ.ఐ) రాజమార్గ యాత్ర మొబైల్‌ అప్లికేషన్‌ ను పరిచయం చేయడం జరిగింది. ఈ యాప్‌ ద్వారా జాతీయ రహదారి వినియోగదారులు కోసం సమగ్ర సమాచారం, ఫిర్యాదుల పరిష్కారం, ప్రయాణ సురక్షితం, సౌకర్యవంతం చేయడం మొదలైన సేవలు లక్ష్యంగా పనిచేస్తుంది.
‘అన్మేష’, ‘ఉత్కర్ష్‌’ ఉత్సవాలు :
ఇటీవల భారత రాష్ట్రపతి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘అన్మేష’ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవాన్ని, జానపద గిరిజన ప్రదర్శన కళల ఉత్కర్ష్‌ ఉత్సవాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 800 మందికి పైగా కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అన్మేష ఉత్సవం ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం. 102 భాషల్లో 75 కి పైగా కార్యక్రమాలలో 575 మందికి పైగా రచయితలు పాల్గొనే ఈ ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం జానపద, గిరిజన వ్యక్తీకరణల భారతదేశపు గొప్ప వారసత్వానికి ప్రతీకగా ఉత్కర్ష్‌ నిలుస్తుంది. దీని ద్వారా భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యం యొక్క స్పష్టమైన చిత్రపటాన్ని సగర్వంఆ ప్రదర్శిస్తుంది.
విశ్వనాధన్‌ ఆనంద్‌ను అధిగమించిన గుకేష్‌ :
17 ఏళ్ల చెస్‌ దిగ్గజం డి. గుకేష్‌ లైవ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కినెట్టి భారత్‌ చెస్‌ ప్లేయర్స్‌లో అగ్రగణ్యుడుగా నిలిచాడు. పిడే వరల్డ్‌ కప్‌ 2వ రౌండ్‌లో మిస్ట్రాడిన్‌ ఇస్కందరోవ్‌ను ఓడించి 2755.9 లైవ్‌ రేటింగ్‌ను సాధించి క్లాసిక్‌ ఓపెన్‌ విభాగంలో 9వ స్థానానికి ఎగబాకడం ద్వారా గుకేష్‌ ఈ ఘనత సాదించాడు. విశ్వనాధన్‌ ఆనంద్‌ రేటింగ్‌ 2754.0తో 10వ స్థానానికి పడిపోయింది. 1986 తర్వాత ఆనంద్‌ అగ్రస్థానం నుంచి వైదొలగడం ఇది 2వ సారి. 25 రేటింగ్‌ పాయింట్లతో లైవ్‌ రేటింగ్‌ 2755.9 కి గుకేష్‌ చేరుకోగా, ఆనంద్‌ రేటింగ్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నత చెస్‌ ప్లేయర్‌గా 9వ స్థానంలో వున్నాడు. 2838 రేటింగ్‌లో మాగ్నాస్‌ కార్లసెన్‌ మొదటి స్థానంలో వున్నాడు.
వీడియో బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న తొలి బ్యాంకు ‘ఎ.యు’ :
భారతదేశంలోనే అతిపెద్ద స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు అయిన ఎ.యు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు వినూత్నంగా 24×7 వీడియో బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫాం ప్రారంభిచుట ద్వారా కస్టమర్‌ సేవలో గణనీయమైన ముందడుగు వేసింది. ఇందులో వినియోగదారులు వీడియో కాల్స్‌ మాదిరిగా నిపుణులైన బ్యాంకర్లతో ముఖాముఖి వీడియో ఇంటరాక్షన్‌లలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. సెలవు దినాలలో కూడా ఇది 24 గంటలు పనిచేస్తుంది. ఇలా భారతదేశంలోనే లైవ్‌ వీడియో బ్యాంకింగ్‌ పరిష్కారాలను అందించే సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఎ.యు. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ చరిత్రలో నిలిచిపోయింది.
అటల్‌ బిహారీ వాజ్‌పేరు వర్ధంతి :
ఆగస్టు 16న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేరు వర్ధంతి సందర్భంగా దేశమంతా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ స్మారక చిహ్నం వద్ద వివిధ రాజకీయ, అనుబంధ నాయకులు సమావేశమయ్యారు. ఉపాధ్యక్షడు జగదీష్‌, దంఖర, అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కారీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ, ప్రపుల్‌ పటేల్‌, అర్జున్‌రామ్‌ మేఘవాల్‌, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌, హెచ్‌.ఎ.ఎమ్‌. జతన్‌ రారు కూడా అటల్‌ బిహారీ వాజ్‌పేరు 5వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2023 : భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15, 2023 న జరుపుకుంది. ఈ సంవత్సరం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలో భాగంగా ‘నేషన్‌ ఫస్ట్‌, ఆల్వేస్‌ ఫస్ట్‌’ అనే థీమ్‌ తో ఈ వేడుకలు జరుపుకున్నారు. స్వాతం్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగుర వేయాలని ప్రజలను ప్రోత్సహిస్తూ ‘హర్‌ ఫర్‌ తిరంగా’ ప్రచారానికి కూడా ప్రధాని మోడీ విలుపునిచ్చారు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love