రాష్ట్రపతిగా పోటి చేసిన మహిళల్లో ద్రౌపది ముర్ము ఎన్నవవారు?

Among the women who contested for the presidency Who is Draupadi Murmu?1. క్రింది వాటిలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ . రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వహక అధికారి అనే పద్ధతిని అమెరికా నుండి తీసుకున్నాము.
బి. దేశంలో కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి. దీనిని అమెరికా రాజ్యంగా నుండి తీసుకున్నాము.
1.బి మాత్రమే 2. ఎ మాత్రమే 3. ఎ,బి 4. ఏదికాదు.
2. భారత రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి గురించి తెలిపే భాగము మరియు అధికరణలు ఏవి?
1.4వ భాగం, 52-62 అధికరణలు 2.5వ భాగం, 52 – 72 అధికరణలు
3. 4వ భాగం 51- 72 అధికరణలు 4. 5వ భాగం – 52-62 అధికరణలు
3. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని సభ్యులు గుర్తించండి.
ఎ. దేశంలోని విధాన పరిషత్‌ సభ్యులు
బి. కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు
సి. ప్రతి రాష్ట్ర అసెంబ్లీలోని ఒక ఆంగ్లో ఇండియన్‌.
డి. రాష్ట్ర విధాన సభకు ఎన్నికయిన సభ్యులు.
1.డి మరియు ఎ 2. ఎ,బి,డి 3. ఎ,బి,సి 4. ఎ,బి,సి,డి
4. రాష్ట్రపతి పదవికాలంలో ప్రథమ పౌరుడిగా ఉంటే విరమణ తర్వాత హోదా క్రమంలో దేశంలో ఎన్నవ స్థానంలో ఉంటారు?
1.2 2. 3 3.4 4. 5
5. భారత రాష్రపతి ఎన్నిక విధానమును రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించినవారు.
1.కె.టి. షా 2. హెచ్‌.వి. కామత్‌ 3. గోపాలస్వామి అయ్యంగార్‌ 4. అంబేద్కర్‌
6. జతపరుచుము. రిటర్నింగ్‌ అధికారులు.
1. పిడిటి ఆచారి ఎ. ప్రతిభాపాటిల్‌ ఎన్నిక
2. అనూప్‌ మిశ్రా బి. మొదటి రాష్ట్రపతి ఎన్నిక
3. ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ సి.ప్రస్తుత లోక్‌సభ సెక్రటరీజనరల్‌
4. యం.ఎన్‌. కౌల్‌ డి. రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిక
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ3,బి2,సి1,డి4
3. ఎ1,బి3,సి4,డి2 4. ఎ1,బి4,సి3,డి2
7. భారత రాజ్యాంగం లోకి ఏ నిబంధన రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను వివరిస్తుంది.
1.69 2. 72 3.71 4. ఏది కాదు.
8. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ. ఎలక్ట్రోరల్‌ సభ్యులు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికపై ఫిర్యాదులు చేయాలి.
బి. రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులు సుప్రీంకోర్టు విచారిస్తుంది.
సి. ఎన్నిక జరిగిన రోజు నుండి 14 రోజులలోపు ఫిర్యాదు చేయాలి.
1.ఎ,బి,సి 2. ఎ,సి 3. ఎ,బి 4. బి,సి
9. 70 వ రాజ్యాంగసవరణ చట్టం ద్వారా ఢిల్లీ – పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికయిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చు అయితే ఢిల్లీకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రత్యేక శాసనసభ ఏర్పాటు చేశారు?
1.69వ రాజ్యాంగ సవరణ చట్టం 2.10వ రాజ్యాంగ సవరణ చట్టం
3.14వ రాజ్యాంగ సవరణ చట్టం 4.12వ రాజ్యాంగ సవరణ చట్టం
10. క్రింది వాటిలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ. మహాభియోగ తీర్మానం ను అమెరికా నుండి గ్రహించాము.
బి. 2/3 వంతు మెజార్టీతో రాష్ట్రపతిని తొలగించవచ్చు.
సి. రాష్ట్రపతి తొలగింపు తీర్మానం మొదటగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.
1.బి మరియు సి 2. ఎ,బి 3. ఎ,సి 4. ఎ,బి,సి
11. క్రింది వాక్యాలలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
1.రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఏదేని రాష్ట్ర శాసనసభ రద్దు అయితే శాసన సభ్యుడికి కూడా ఓటు వేయడానికి అనర్హుడు.
2. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌ యం.ఎల్‌.ఏ లు ఓటు వినియోగించుకున్నారు.
3. 1మరియు 2 4. పై ఏది కాదు.
12. రాష్ట్రపతిని ఎలక్ట్రోరల్‌ కాలేజ్‌ నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నిక చేస్తుంది. అయితే ఈ పద్ధతికి గల ఇతర పేర్లను కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1.హేర్‌ పద్ధతి 2. ప్రిఫరెన్షియల్‌ పద్ధతి 3. ఆండ్రే పద్ధతి 4. పైవన్నీ
13. ఉపరాష్ట్రపతిగా పని చేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన వారు ఎంత మంది .
1. 6 2. 5 3.3 4. 4
14. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రెండు పదవులు ఖాళీ ఏర్పడినపుడు కింది వారిలో ఎవరు రాష్ట్రపతి విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
1. స్పీకర్‌ 2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి/ సీనియర్‌ న్యాయమూర్తి.
3. ప్రధానమంత్రి 4. రాజ్యసభ చైర్మన్‌
15. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించినవారు.
1. ఉత్పల్‌ కుమార్‌సింగ్‌ 2. స్నేహలత శ్రీవాస్తవ
3. ప్రమోద్‌ చంద్రమోడీ 4. అనూప్‌ మిశ్రా
16. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటి చేసిన మహిళల్లో ద్రౌపది ముర్ము ఎన్నవవారు?
1. 1 2. 4 3. 2 4. 6
17. 16వ రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఏ రోజున నిర్వహించింది.
1. 27.7.2022 2. 18.7.2022
3. 21.7.2022 4. 25.7.2022
18. ప్రస్తుత రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి చెందిన వారు?
1.జార్ఖండ్‌ 2. ఒడిషా 3. అస్సాం 4. ఉత్తరప్రదేశ్‌
19. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఏది?
1.అరుణాచల్‌ప్రదేశ్‌ 2. మహారాష్ట్ర 3. తమిళనాడు 4. ఉత్తరప్రదేశ్‌
20. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2015-2021 వరకు ఏ రాష్ట్రానికి గవర్నర్‌ గా పని చేశారు?
1.జార్ఖండ్‌ 2. పశ్చిమబెంగాల్‌ 3. ఒడిషా 4. అస్సాం
21. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో అతి తక్కువ ఓటు విలువ కల్గిన రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్‌ 2. తెలంగాణ 3. అస్సాం 4. సిక్కిం
22. ద్రౌపది ముర్ము స్వాతంత్య్రానంతరం జన్మించిన రాష్ట్రపతుల జాబితాలో ఎన్నవ వారు?
1. 4 2. 2 3. 1 4. 4
23. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ఓటు విలువ ఎంత?
1. 176 2.148 3.132 4. 159
24. ద్రౌపది ముర్ము గురించి క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి.
1. తొలి గిరిజన రాష్ట్రపతి
2. రారురంగపూర్‌ నుండి నగర పంచాయితీ కౌన్సిలర్‌ గా ఎన్నిక
3. వాణిజ్య మరియు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు.
4. పైవన్నీ
25. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఓటు విలువ ఎంత?
1. 208
2. 176
3. 148
4. 159

26. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్‌ రాష్ట్రానికి ఎన్నవ గవర్నర్‌గా పనిచేశారు?
1. 9 2. 5 3. 8 4. 4
27. అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అయిన 2వ వారు ఎవరు?
1. ద్రౌపది ముర్ము 2. రామ్‌నాథ్‌కోవింద్‌
3. నీలం సంజీవరెడ్డి 4. వి.వి.గిరి
28. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో ఎంపి ఓటు విలువ ఎంత?
1. 708 2. 750 3. 800 4. 700
29. ప్రస్తుత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1.దీపక్‌ మిశ్రా 2. యు.యు.లలిత్‌
3. డి.వై. చంద్రచూడ్‌ 4. ఎన్‌.వి.రమణ
30. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటి పడిన మహిళా అభ్యుర్దుల్లో మీరా కుమార్‌ ఎన్నవవారు?
1. 6 2. 4 3. 2 4. 5
31. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయి.
1. 65.65% 2. 64.03% 3. 33.97% 4. 34.35%
32. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించినవారు.
1. ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ 2. స్నేహలత శ్రీవాస్తవ
3. ప్రమోద్‌ చంద్రమోడీ 4. అనూప్‌ మిశ్రా
33. 16 రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
1. యశ్వంత్‌ సిన్హాను సిక్కిం, నాగాలాండ్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా రాలేదు.
2. ద్రౌపది ముర్ముకు కేరళ నుండి ఒక్క ఓటు కూడా లభించలేదు.
3. 1,2 4. ఏది కాదు.
34. జతపరుచుము.
రాష్ట్రపతులు ప్రత్యేకతలు
ఎ. జాకీర్‌ హుస్సేన్‌ 1.స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికైన రాష్ట్రపతి.
బి. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 2. అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీచేసిన రాష్ట్రపతి.
సి. ఫకృద్ధీన్‌ ఆలీ 3. తక్కువ కాలం పనిచేసిన తొలి రాష్ట్రపతి.
డి. వి.వి.గిరి 4. విదేశీరాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు.
1.ఎ1,బి2,సి3,డి4 2.ఎ3,బి1,సి2,డి4
3.ఎ3,బి4,సి1,డి2 4.ఎ3,బి4,సి2,డి1
35. 1997 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీచేయాలంటే ఎలక్ట్రోరల్‌ కాలేజిలోని ఎంత మంది సభ్యులు అతని/ ఆమో ఎన్నికను ప్రతిపాదించాలి బలపర్చాలి.
1.20,50 2. 50,50 3. 10,10 4. 20,20
36. క్రింది వాటిలో సరైన అంశం / అంశాలు గుర్తించండి.
ఎ. ఒక వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే వారు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వంలో ఆదాయం వచ్చే ఉద్యోగాలలో ఉండరాదు.
బి. లోక్‌సభ ఎన్నికకు కావాల్సిన అర్హతలు ఉండవలెను.
1.బి మాత్రమే 2. ఎ,బి 3. ఎ మాత్రమే 4. ఏది కాదు.
37. క్రింది వాక్యాలలో సరికాని వాక్యం/వాక్యాలు గుర్తించండి.
ఎ.రాష్ట్రపతి జీతభత్యాలు గురించి తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరిచారు.
బి. జీతభత్యాలపై ఆదాయ పన్ను ఉండదు.
సి. జీత భత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది.
1.బి మాత్రమే 2. ఎ మాత్రమే 3. బి,సి 4. ఎ,బి,సి
38. జతపరుచుము. ఆర్టికల్స్‌ – వివరణ
ఎ.ఆర్టికల్‌ 60 1. రాష్ట్రపతి తొలగింపు
బి.ఆర్టికల్‌ 56 2.అనర్హతలు జీతభత్యాలు షరతులు
సి. ఆర్టికల్‌ 59 3.పదవీ ప్రమాణ స్వీకారం
డి.ఆర్టికల్‌61 4. రాష్ట్రపతి పదవీకాలం
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ3,బి4,సి1,డి2
3.ఎ2,బి1,సి3,డి4 4. ఎ3,బి4,సి2,డి1
39. క్రిందివాక్యాల్లో ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్రపతి అయిన వారిని గుర్తించండి.
ఎ. కె.ఆర్‌. నారాయణ్‌ బి. ఆర్‌.వెంకట్రామన్‌
సి.జ్ఞాని జైల్‌సింగ్‌ డి. శంకర్‌దయాల్‌శర్మ
1.ఎ,బి 2. సి,డి 3. బి,సి,డి 4. ఎ,సి,డి
40. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న మొట్ట మొదటి రాష్ట్రపతి ఎవరు?
1. ప్రతిభాపాటిల్‌ 2.ఎ.పి.జె.అబ్దుల్‌కలాం
3. ప్రణబ్‌ ముఖర్జీ 4. మన్మోహన్‌ సింగ్‌
41. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్ని సార్లు చేపట్టవచ్చు?
1. 2 సార్లు 2. ఎన్నిసార్లయిన
3. మూడుసార్లు 4. ఏది కాదు.
42. రాష్ట్రపతి రాజీనామా చేయదలిస్తే రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
1. ప్రధానమంత్రి 2. స్పీకర్‌
3. ఉపరాష్ట్రపతి 4. ఎవరుకాదు.
43. క్రిందివారిలో భారతరత్న పొందిన రాష్ట్రపతులు గుర్తించండి.
ఎ.కె.ఆర్‌.నారాయణ బి. జాకీర్‌ హుస్సేన్‌
సి.వి.వి.గిరి డి. ప్రణబ్‌ముఖర్జీ
1. ఎ,సి,డి 2. బి,సి,డి
3. బి,డి 4. ఎ,బి,సి,డి
44. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే కావాల్సిన అర్హతలు ఏవి?
ఎ. భారత పౌరసత్వం కలిగి ఉండవలెను.
బి. లోక్‌సభ ఎన్నికకు కావాల్సిన అర్హతలు ఉండవలెను.
సి. 30 సం.లు నిండి ఉండవలెను.
1. ఎ,బి,సి 2. ఎ,బి 3. ఎ,సి 4. బి,సి
45. భారతరాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణ రాష్ట్రపతి పదవి విరమణ చేసే 15 రోజుల ముందు రాష్ట్రపతి ఎన్నికల కార్యక్రమం ప్రారంభమై నూతన రాష్ట్రపతి ఎన్నిక కావాలి అని పేర్కొంటుంది?
1.ఆర్టికల్‌ 59 2.ఆర్టికల్‌ 60
3. ఆర్టికల్‌ 62 4. ఆర్టికల్‌ 61
46.క్రిందిఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి తన కార్యనిర్వహధికారాలను వినియోగించడంలో సలహా సహకారం కొరకు ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది?
1.ఆర్టికల్‌ 53 2. ఆర్టికల్‌ 74(1)
3. ఆర్టికల్‌ 74(2) 4. ఆర్టికల్‌ 75(1)
47. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పని చేసిన తొలి మహిళ.
1.స్నేహలత శ్రీవాస్తవ 2. వి.ఎస్‌.రమాదేవి
3. గురుచరణ్‌ కౌర్‌ 4. సుమిత్రాదేవి
48. రాజ్యాంగ పరిషత్‌ లో రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించిన వారు ఎవరు?
1. కె.టి.షా 2. గోపాలస్వామి అయ్యంగార్‌
3. అంబేద్కర్‌ 4. ఎవరు కాదు.
49. ఓటు బదలాయింపు పద్ధతిని రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించినవారు?
1.హెచ్‌.వి.కామత్‌ 2. గోపాలస్వామి అయ్యంగార్‌
3. కె.టి. షా 4. అంబేద్కర్‌
50. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించేది ఎవరు?
1. రాజ్యసభ చైర్మన్‌ 2. స్పీకర్‌
3. ప్రధానమంత్రి 4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సమాధానాలు
1.1 2.4 3.3 4.4 5.3 6.4 7.3 8.3 9.1 10.2 11.1 12.4 13.1 14.2 15.3 16.4 17.2 18.2 19.4 20.1 21.4 22.3 23.3 24.4 25.4

డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు
9494228002

Spread the love