భారత దేశంలో బ్రిటీష్‌ పాలనకు పునాది వేసిన మొదటి యుద్ధం?

The first war that laid the foundation of British rule in India? బెంగాల్‌లోని భాగీరధీ తీరంలోని ప్లాసి (ప్రస్తుతం పలాషి) వద్ద జరగడం వలన ఈ యుద్ధాన్ని ప్లాసి యుద్ధం అంటారు.
అత్యంత సారవంతమైన ధనిక బెంగాల్‌ పై బ్రిటీష్‌ కంపెనీ కన్ను పడింది. దాని కోసం సిరాజుద్దౌలా బెంగాల్‌ నవాబు కావడాన్ని వ్యతిరేకించిన ఘస్తీ బేగం, షాకత్‌ జంగ్‌ లాంటి వారితో మంతనాలు జరిపి, నవాబు ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఈస్టిండియా కంపెనీ కలకత్తాలోని విలియమ్స్‌ కోటను ఆధునీకరణ చేపట్టింది. నవాబు శిక్షించిన కృష్ణవల్లబ్‌కు ఆశ్రయం కల్పించింది. అంతే కాకుండా మొగల్‌ చక్రవర్తి ఫరలాఖ్‌ షియార్‌ 1717 లో కంపెనీ సుంకాలను తొలగిస్తూ ఇచ్చిన ఫర్మానాను ఉల్లంఘించింది.
ఈ పరిణామాలు అనంతరం ఖాసింబజార్‌లోని ఇంగ్లీష్‌ ప్యాక్టరీని సిరాజుద్దౌలా ఆక్రమించాడు. తర్వాత విలియం కోటను స్వాదీనం చేసుకున్నాడు. కంపెనీ సైన్యం సిరాజుద్దౌలా కు లొంగిపోయింది. మద్రాస్‌ కౌన్సిల్‌కు ఈ విషయం తెలిసి రాబర్ట్‌ క్లైవ్‌, అడ్మిరల్‌ వాట్సన్‌ ఆధ్వర్యంలో సైన్యాన్ని బెంగాల్‌కు పంపింది. ఈ ఘర్షణలో సిరజుద్దౌలా ఓడిపోయి 1757 ఫిబ్రవరిలో ఆంగ్లేయులతో ఆలీఘర్‌ సంధిచేసుకున్నాడు. దీనితో కంపెనీ కోటలను నిర్మించుకునే హక్కు పొందింది.
బ్రిటీషర్లు సిరాజుద్దౌలాను పదవి నుంచి తొలగించేందుకు సిరాజుద్దౌలా వ్యతిరేకులైన మాణిక్‌ చంద్‌, అమీన్‌ చంద్‌, జగత్‌ సేఠ్‌ లాంటి వారితో కలిసి వ్యూహాలు పన్ని మీర్‌ జాపర్‌ను నవాబు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా పధకం ప్రకారం సిద్ధం చేసుకుని, అలీఘర్‌ సంధి ఉల్లంఘన నెపంతో సిరాజుద్దౌలాపై కంపెనీ యుద్ధం ప్రకటించింది. 1757 జూన్‌ 23 న ప్లాసి వద్ద కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దేలా ఎదుర్కొన్నాడు. పథకం ప్రకారం సిరాజుద్దౌలాను ఓడించి చంపివేశారు. మీర్‌ జాఫర్‌ను బెంగాల్‌కు నవాబును చేశారు. దీనికి ప్రతిఫలంగా మీర్‌ జాఫర్‌ బెంగాల్‌లోని 24 పరగణాలను కంపెనీకి దానం చేశాడు.
ప్లాసి యుద్ధం ఫలితంగా బెంగాల్‌ని బ్రిటీష్‌ పాలనకు పునాది పడింది. బెంగాల్‌ సంపద నిరంతరం ఇంగ్లాండ్‌కు తరలిపోయింది. ఈ యుద్ధం కేవలం బెంగాల్‌లోనే కాకుండా యావత్‌ భారతదేశంలో బ్రిటీష్‌ ఆదిపత్యానికి బాటలు వేసింది.
1. బెంగాల్‌ లోని ప్లాసి యుద్ధం జరిగిన ప్రాంతమయిన ప్లాసి ప్రస్తుత నామం:
ఎ. పలాస బి. పలాషి సి. ప్లాస్కి డి. ప్లాసియాబాగ్‌
2. సిరాజుద్దౌలా ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఈస్టిండియా కంపెనీ ఏ కోటకు ఆధునీకరణ చేపట్టింది?
ఎ. విలియమ్స్‌ కోట బి. టైమ్‌ బాల్‌ టవర్‌ పోర్ట
సి. పంచరహ డి. కిచనర్‌ హౌస్‌
3. 1717లో కంపెనీ సుంకాలను తొలగిస్తూ ఏ మొఘల్‌ చక్రవర్తి ఫర్మానా జారీ చేశాడు?
ఎ. ఔరంగజేబు బి. ముర్షీద్‌కుత్‌ఖాత్‌
సి. ఫరూఖ్‌ షియర్‌ డి. ఆలీ వర్దీఖాన్‌
4. 1757లో సిరాజుద్దౌలా ఓడిపోయి ఆంగ్లేయులతో చేసుకున్న సంధి?
ఎ. పోర్ట్‌ విలియం సంధి బి. బెంగాల్‌ సంధి
సి. కొలకత్తా సంధి డి. ఆలీఘర్‌ సంధి
5. ఏ సంధి ఫలితంగా కంపెనీ కోటలను నిర్మించుకునే హక్కులను తిరిగి పొందింది?
ఎ. అలీఘర్‌ సంధి బి. బెంగాల్‌ సంధి
సి. పోర్ట్‌ సంధి డి. కొలకత్తా సంధి
6. బ్రిటీషర్లు సిరాజుద్దౌలాను తొలగించేందుకు ఎవరితో కలిపి వ్యూహాలు పన్నారు?
ఎ. ఫ్రెంచ్‌ వారితో బి. సిరాజుద్దౌలా వ్యతిరేకులతో
సి. సిరాజుద్దౌలా సైనికాధికారితో డి. బెంగాల్‌ వ్యాపారులతో
7. బ్రిటీషర్లు ఎవరిని బెంగాల్‌కు నవాబుగా నియమించాలని పథకం వేశారు?
ఎ. మాణిక్‌ చంద్‌ బి. అమీన్‌ చంద్‌
సి. మీర్‌ జాఫర్‌ డి. జగత్‌ సేఠ్‌
8. దేనిని కారణంగా చూపి కంపెనీ సిరాజుద్దౌలా పై యుద్ధం ప్రకటించింది?
ఎ. చీకటి గది ఉదంతం బి. అలీఘర్‌ సంధి ఉల్లంఘన
సి. విలియం కోట ఆక్రమణ డి. పైవేవీ కావు
9. ప్లాసి యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ. 1752 జూన్‌ 23 బి. 1757 జూన్‌ 23
సి. 1757 జనవరి 23 డి. 1767 జూన్‌ 23
10. ప్లాసి యుద్ధంలో రాబర్ట్‌క్లైంక్‌ సైన్యం, సిరాజుద్దౌలా సైన్యం ఎంతెంత మంది పాల్గొన్నారు?
ఎ. 3,000 – 18,000 బి. 30,000 – 18,000
సి. 3,000 – 2,000 డి. 3,000 – 15,000
11. ప్లాసి యుద్ధం కంపెనీ కుట్ర వలన ఎంత సమయంలో ముసిగింది?
ఎ. కేవలం 60 నిమిషాలు బి. కేవలం 40 నిమిషాలు
సి. కేవలం 10 నిమిషాలు డి. కేవలం 30 నిమిషాలు
12. సిరాజుద్దౌలా మరణం తరువాత కంపెనీ బెంగాల్‌ నవాబుగా ఎవరిని ప్రకటించింది?
ఎ. మీర్‌ జాఫర్‌ బి. మానిక్‌ చంద్‌ సి. ఆమీన్‌ చంద్‌ డి. రాబర్ట్‌ క్లౌవ్‌
13. మీర్‌ జాఫర్‌ను బెంగాల్‌ నవాబుగా చేసినందుకు కృతజ్ఞతగా ఎన్ని పరగణాలను కంపెనీకి దారాదత్తం చేశాడు?
ఎ. 28 బి. 24 సి. 25 డి. 26
14. భారత దేశంలో బ్రిటీష్‌ పాలనకు పునాది వేసిన మొదటి యుద్ధం?
ఎ. కర్ణాటక యుద్ధం బి. బెంగాల్‌ యుద్ధం
సి. ప్లాసి యుద్ధం డి. పై వేవీ కావు
15. చరిత్రలో ఒక గొప్ప ద్రోహంగా ఏ యుద్ధాన్ని పేర్కొంటారు?
ఎ. కర్ణాటక యుద్ధం బి. బాక్సర్‌ యుద్ధం
సి. ప్లాసి యుద్ధం డి. పైవేవీ కావు
16. ఏ రెండు యుద్ధాలు ఆంగ్లేయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి?
ఎ. ప్లాసి, బక్సార్‌ బి. ప్లాసి, కర్ణాటక యుద్ధం
సి. బక్సార్‌, ఆంగ్లో – మరాఠా యుద్ధం డి. పైవేవీ కావు
17. సిరాజుద్దౌలాను హత్య చేయించింది ఎవరు?
ఎ. మీర్‌ జాఫర్‌ బి. మీర్‌ జాఫర్‌ సోదరుడు
సి. మీర్‌ జాఫర్‌ కొడుకు (మిరాన్‌) డి. పై వేవీ కావు
18. ప్లాసి యుద్ధం ఫలితంగా 1985లో సిమ్మన్స్‌ క్లింగింగ్‌ స్మీత్‌, విలియమ్‌ సన్‌ చేసిన పరిశోధనల్లో ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 1750లో 24.5 శాతంగా వున్న భారత్‌ వాటా ఎంతకు పడిపోయింది?
ఎ. 1880 నాటికి కేవలం 2.8 శాతం బి. 1880 నాటికి కేవలం 3 శాతం
సి. 1880 నాటికి కేవలం 3.8 శాతం డి. 1880 నాటికి కేవలం 2 శాతం
19. ప్లాసి యుద్ద వీరుడు అని ఎవరిని పిలుస్తారు?
ఎ. సిరాజుద్దౌలా బి. మీర్‌ జాఫర్‌
సి. రాబర్ట్‌ క్లైవ్‌ డి. జగత్‌ సేఠ్‌
20. బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ బెంగాల్‌ నవాబు, అతడి ఫ్రెంచి మిత్రుల కూటమిపై ‘నిర్ణయాత్మక విజయం’ సాధించిన యుద్ధం :
ఎ. బక్సార్‌ యుద్ధం
బి. ప్లాసి యుద్ధం
సి. చిన్సూరా యుద్ధం
డి. పై వేవీ కావు
సమాధానాలు
1.బి 2.ఎ 3.సి 4.డి 5.ఎ
6.బి 7.సి 8.బి 9.బి 10.ఎ
11.బి 12.ఎ 13.బి 14.సి 15.సి
16.ఎ 17.సి 18.ఎ 19.సి 20.బి
– కె. నాగార్జున
ఇండియన్‌ హిస్టరీ
9490352545 

Spread the love