కరెంట్‌ అఫైర్స్‌

Current Effairs ఆపరేషన్‌ (త్రినేత్ర) 2 : ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జమ్మూకాశ్మీర్‌లోని సిందార, సూరన్‌ కోట్‌ తాలూకా మైదానాల్లో జులై 17న ఆపరేషన్‌ (త్రినేత్ర) 2 ను చేపట్టారు. జమ్మూకాశ్మీర్‌ సరిహద్దులోని పూంచ్‌ జిల్లాలో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా త్రినేత్ర 2 పేరుతో గాలింపు చర్యలు చేపట్టారు. జులై 16, 17 తేదీల మధ్య రాత్రి పూంచ్‌ కృష్ణ ఘాటీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జకార్తాలో ద్వైపాక్షిక విన్యాసాలు : ఇండోనేషియా నావికా దళంతో కలిసి ద్వైపాక్షిక విన్యాసాలలో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కొల్‌కతా నౌకలు జకార్తాకు చేరుకున్నాయి. పరస్పర సహకారం, అవగాహనను బలోపేతం చేసే లక్ష్యంతో భారత్‌, ఇండోనేషియా నౌకాదళాలు వృత్తిపరమైన పరస్పర చర్యలు, ఉమ్మడి యోగా సెషన్స్‌, క్రీడా కార్యక్రమాలు, క్రాస్‌ డెక్‌ సందర్శనల విస్కృత కార్యక్రమాలలో పాల్గొంటాయి. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల సముద్ర శక్తి 2023 పేరుతో భారత్‌, ఇండోనేషియా నావికా దళాలు ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ ‘సింగపూర్‌’ : హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ హోదా సింగపూర్‌ కలిగి వుంది. 227 ప్రపంచ ప్రయాణ గమ్య స్థానాలలో 192 గమ్య స్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని సింగపూర్‌ అందిస్తుంది.
ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌ ఈ మూడు యూరోపియన్‌ దేశాలు 190 వీసా రహిత ప్రవేశంతో రెండవ స్థానంలో వున్నాయి. 189 గమ్య స్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్న జపాన్‌ మూడవ స్థానంలో వుంది. ఇక భారత్‌ 57 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తూ 80 వ స్థానంలో వుంది.
ప్రపంచం మునిగిపోయే నివారణ దినోత్సవం జులై 25 : ఏటా సుమారు 2,36,000 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారని 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఈ దుర్ఘటనకు ఎక్కువగా గురి అవుతున్నారని, మునిగిపోవడం, నోరు ముక్కు నీటితో నిండి ఊపిరి ఆడక పోవడం లాంటి ఇతర బాధితులకు సహాయం చేయడం… ఇలాంటి పరిస్థితులను నివారించుట కోసం 2021 ఏప్రిల్‌లో ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ తీర్మానం A/=జుూ/75/273 ద్వారా ప్రపంచ మునిగిపోయే నివారణ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి సంఘటనలను నివారించడానికి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జులై 25న ప్రపంచ మునిగిపోయే నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే : తెలంగాణ హైకోర్ట్‌ ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే జులై 23న నియమితులయ్యారు. హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళ్‌సై సాందరరాజన్‌ అలోక్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ భుయాన్‌ స్థానంలో జస్టిస్‌ అలోక్‌ ఆరాధే నియమితులయ్యారు. ఈయన 2009 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌ హైకోర్ట్‌ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ICC వరల్డ్‌కప్‌ 2023 బ్రాండ్‌ అంబాసిడర్‌ – షారుక్‌ఖాన్‌ : ఐసిసి వరల్డ్‌ కప్‌ 2023 కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ నియమితులయ్యారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ ఖాన్‌ తన ఐకానిక్‌ వాయిస్‌ ఓవర్‌తో వరల్డ్‌ కప్‌ 2003 క్యాంపెయిన్‌ ‘ఇట్‌ టేక్‌ వన్‌ డే’ ను ప్రారంభించారు. ICC వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ ప్రకారం 2023 ×జజ పురుషుల క్రికెట్‌ ప్రపంచ కప్‌ 2023 అక్టోబర్‌ 5 నుండి నవంబర్‌ 19 వరకు భారత్‌లో జరగనుంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. 2023 అక్టోబర్‌ 5 నుండి భారత్‌లో ఈ ప్రపంచ కప్‌ జరుగుతుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో, అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీ స్టేడియంలో రోషిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా పాకిస్తాన్‌తో తలపడనుంది.
అంతర్జాతీయ పులుల దినోత్సవం జులై 29 : సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ టైగర్‌ సమ్మిట్‌ సందర్భంగా 2010 లో ప్రారంభమైనప్పటి నుండి ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అడవి పులుల సంఖ్య గణనీయంగా క్షీణించడంపై అవగాహన పెంచడం ఈ రోజు ప్రధాన వుద్దేశ్యం. పులులు వాటి సహజ ఆవాసాలను పరిరక్షించడంపై దృష్టి సారించే సమగ్ర అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించడం దీని ప్రధాన లక్ష్యం.

Spread the love