దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

నవతెలంగాణ- కల్వకుర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, ఎంపీపీ మనోహర అన్నారు. గురువారం పట్టణంలో మున్సిపల్‌ కార్యాల యంతోపాటు, ఎంపీపీ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిం చడం జరుగుతుందన్నారు. రేపు ఉదయం తెలంగాణ తల్లివి గ్రహం వద్ద కార్యక్ర మం ప్రారంభమవుతుందని అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుం దని చెప్పారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ షాహిద్‌, కౌన్సిలర్లు సూర్య ప్రకాష్‌రావు, భోజిరెడ్డి, మనోహర్‌ రెడ్డి, కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయా లని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎస్‌ఎస్‌ఆర్‌ ఫీల్డింగ్‌ స్టేషన్లను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడా రు.. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త అధికారు లందరూ పా ల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, హరినాథ్‌, రాజా, రంగారావు, మందరాజేందర్‌ రెడ్డి, సురేందర్‌రెడ్డి, లాలుయాదవ్‌, అంజి, రమేష్‌గౌడ్‌, రాజశేఖర్‌రెడ్డి, జూలూరి శ్రీను, రమేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి: మండల కేంద్రంలో ఈ నెల 3న జరిగే దశాబ్ది ఉత్సవాలను జ యప్ర దం చేయాలని వ్యవసాయ మండల అధికారి నాగరాజు తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతు వేది కల వద్ద ఉద యం9: 00గంటల సమయంలో ఏఈవోల ఆధ్వర్యంలో నిర్వ హించనున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ విధిగా హాజరై కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Spread the love